Mass Jathara : ‘మాస్ జాతర’ టీజర్ టాక్..ఇక జాతర జాతరే
Mass Jathara : ఈ టీజర్ చూస్తుంటే పాతకాలం నాటి రవితేజ సినిమాల వైబ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రవితేజ పోలీస్ గెటప్ లో కనిపించి మాస్ యాక్షన్ తో, పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు
- By Sudheer Published Date - 01:03 PM, Mon - 11 August 25

రవితేజ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘మాస్ జాతర’ (Mass Jathara) సినిమా టీజర్ వచ్చేసింది. ఈ టీజర్ చూస్తుంటే పాతకాలం నాటి రవితేజ సినిమాల వైబ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రవితేజ పోలీస్ గెటప్ లో కనిపించి మాస్ యాక్షన్ తో, పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. ‘క్రాక్’, ‘విక్రమార్కుడు’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్ గా మెప్పించిన రవితేజ, ఇప్పుడు మరోసారి అదే తరహా పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.
KTR : కాగ్ త్రైమాసిక నివేదిక..రాష్ట్ర ఆదాయంలో భారీ పతనం కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు
ఈ టీజర్లో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, రవితేజ మరియు శ్రీలీల మధ్య కామెడీతో కూడిన రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. ఈ సన్నివేశాలు సినిమాలో వినోదానికి లోటు ఉండదని సూచిస్తున్నాయి. శ్రీలీల గ్లామర్ మరియు రవితేజ టైమింగ్ కలిసి సినిమాకు మంచి జోష్ తీసుకొచ్చాయి. ఈ కాంబినేషన్ ఈ సినిమాలో ఎంతగా నవ్విస్తుందో, అలరిస్తుందో చూడాలి. గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా ఆగస్టు 27న ‘మాస్ జాతర’ థియేటర్లలో విడుదల కానుంది. మాస్ యాక్షన్, కామెడీ, రొమాన్స్ కలగలిసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.