Manju Varrier : రజిని.. అమితాబ్ ఆ విషయంలో పోటీ పడతారట..!
Manju Varrier ఈ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తుంది. రజినీ అమితాబ్ స్క్రీన్ షేరింగ్ ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. ఐతే ఒకే సినిమాలో ఇద్దరు క్రేజీ
- By Ramesh Published Date - 11:22 AM, Sat - 28 September 24

సూపర్ స్టార్ రజినీకాంత్ బిగ్ బీ అమితాబ్ ఇద్దరు కలిసి వేట్టయ్యన్ సినిమాలో నటిస్తున్నారు. టీ జే జ్ఞానవేల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తుంది. రజినీ అమితాబ్ స్క్రీన్ షేరింగ్ ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. ఐతే ఒకే సినిమాలో ఇద్దరు క్రేజీ స్టార్స్ తో నటించడంపై మంజు వారియర్ తన సంతోషాన్ని మీడియాతో పంచుకుంది. సెట్ లో ఇద్దరు తామొక సూపర్ స్టార్స్ అన్న ఆలోచన ఎక్కడ లేకుండా కనిపించారని అన్నది.
రజినీ (Rajinikanth), అమితాబ్ ఇద్దరు చాలా డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీస్.. ఆ విషయంలో ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడతారని చెప్పుకొచ్చింది మంజు వారియర్. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న వేట్టయ్యన్ (Vettaian) సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ కాగా అది కూడా సూపర్ ట్రెండింగ్ లో ఉంది. ముఖ్యంగా మంజు వారియర్ డ్యాన్స్ ఆ సాంగ్ కు స్పెషల్ క్రేజ్ తెచ్చింది.
ఛాలెంజింగ్ రోల్స్ కు రెడీ..
సౌత్ ఆడియన్స్ తన మీద చూపిస్తున్న ప్రేమకు సంతోషంగా ఉందన్న మంజు వారియర్ (Manju Varrier) ఛాలెంజింగ్ రోల్స్ కు రెడీ అంటుంది. మలయాళంలో మంచి నటిగా ప్రూవ్ చేసుకున్న మంజు మిగతా బాషల్లో కూడా రాణించాలని చూస్తుంది. వేట్టయ్యన్ సినిమా అక్టోబర్ 10న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది.
జైలర్ తర్వాత సూపర్ స్టార్ రజిని నుంచి వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రజిని మార్క్ స్టైలిష్ యాక్షన్ తో పాటుగా జ్ఞానవేల్ మార్క్ స్టోరీ టెల్లింగ్ కూడా ఉంటుందని తెలుస్తుంది.
Also Read : Devara First Day Collections : దేవర ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్క ఇదే..!