Mandaadi Accident: మందాడి షూటింగ్‌లో పడవ బోల్తా – కోటి రూపాయల నష్టం
చెన్నై సముద్రతీరంలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ పడవ (boat) సముద్రంలో బోల్తా (capsized) పడింది.
- By Dinesh Akula Published Date - 02:13 PM, Sun - 5 October 25

చెన్నై, అక్టోబర్ 5: తమిళ ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran) నిర్మిస్తున్న తాజా చిత్రం ‘మందాడి (Mandaadi)’ షూటింగ్ సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ చిత్రంలో తమిళ కమెడియన్ సూరి (Soori) హీరోగా నటిస్తుండగా, తెలుగు నటుడు సుహాస్ (Suhas) విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
చెన్నై సముద్రతీరంలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ పడవ (boat) సముద్రంలో బోల్తా (capsized) పడింది. ఆ పడవలో ఉన్న ఇద్దరు సాంకేతిక నిపుణులను మిగిలిన సిబ్బంది సురక్షితంగా రక్షించారు. అయితే పడవలో ఉన్న కెమెరాలు, ఇతర షూటింగ్ పరికరాలు సముద్రంలో కొట్టుకుపోయాయి.
On the sets of #Mandaadi starring Soori & #Suhas a boat carrying the crew’s RED camera (worth ₹60 lakh) capsized near Thondi Ramanathapuram. Everyone is safe but the camera sank in the sea.⛵❤️🔥 pic.twitter.com/XoBnKcJaX2
— Film Fellows (@fellows_film) October 5, 2025
ఈ ప్రమాదంతో చిత్రం యూనిట్‌కు దాదాపు రూ.1 కోటి వరకు నష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాదం సమయంలో షూటింగ్ యూనిట్ తీవ్ర ఉత్కంఠకు గురైంది. సురక్షితంగా బయటపడిన సిబ్బంది మళ్లీ పనిచేయలేని స్థితిలో ఉన్నారని సమాచారం.
సుహాస్‌కు (Suhas) ఇది తొలి తమిళ చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి ఆసక్తి ఉంది. ఈ చిత్రానికి మతిమారన్ పుగళేంది (Mathimaran Pugazhendhi) దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది.
Accident in #Mandaadi — Camera Fell Inside Water While Shooting in Sea🤯🙂
High-End Red Digital Cameras Worth Upto ₹1 Crores were Damaged!! pic.twitter.com/ZpxY93ld06
— Saloon Kada Shanmugam (@saloon_kada) October 5, 2025