Manchu Manoj: మీరు బతకండి, ఇతరులనూ బతకనివ్వండి: మనోజ్ ట్వీట్ వైరల్!
తాజాగా మంచు మనోజ్ మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
- Author : Balu J
Date : 25-03-2023 - 5:17 IST
Published By : Hashtagu Telugu Desk
మంచు మనోజ్ కు చెందిన వ్యక్తిపై మంచు విష్ణు చేయి చేసుకన్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మంచు ఫ్యామిలీ అన్నదమ్ముళ్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని స్పష్టమైంది. మనోజ్ వీడియోపై తండ్రి మోహన్ బాబు వెంటనే మనోజ్ ను మందలించడం, ఆ వీడియోను తొలగించడం వెంటనే జరిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా మంచు మనోజ్ మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
కళ్ల ముందు జరుగుతున్న తప్పులను చూసి చూడనట్టు వదిలేయడం కన్నా నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్ధమే, క్రియేటివిటీకి నెగెటివిటీయే శత్రువు అంటూ రెండు కోట్‌లను షేర్ చేస్తూ మీరు బతకండి, ఇతరులను కూడా బతకనివ్వండి అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్న మంచు మనోజ్ ఇంటిపైకి మంచు విష్ణు వచ్చి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంచు మనోజ్ ఓ వీడియోను షేర్ చేశాడు.
ఇలా ఇంటి మీదకు వచ్చి దాడి చేస్తాడంటూ విష్ణు విజువల్స్‌ను మనోజ్ షేర్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది కూడా. అయితే ఈ విజువల్స్‌లో మంచు విష్ణు కనిపించాడు. వీడియోలో కొందరిని తిడుతూ ఆగ్రహం వ్యక్తం చేేశాడు. విష్ణుని అందరూ ఆపే ప్రయత్నం చేశారు. మంచు వారింట్లో ఇలాంటి ఏదో జరుగుతోందని గతంలో చాలాసార్లు రూమర్లు వచ్చాయి. మంచు సోదరుల మధ్య మంచి బంధాలు లేవనే టాక్ వస్తూనే ఉంది. అయితే తాజా పరిస్థితులపై మోహన్ బాబు కలుగజేసుకున్నా.. అన్నదముళ్ల మధ్య గొడవలకు పుల్ స్టాప్ పడలేదని మనోజ్ ట్వీట్ తో మరోసారి రుజువైంది.
Live and let live 🙏🏼❤️ Love you all with all my heart. #ManchuManoj pic.twitter.com/ypecRuZwLG
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 25, 2023