HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mammoottys Bhrama Yugam Movie Which Is Raising Expectations Is A Key Update On Its Release

Mammootty: అంచనాలు పెంచుతున్న మమ్ముట్టి ‘భ్రమయుగం’ మూవీ, విడుదలపై కీలక అప్డేట్

  • By Balu J Published Date - 08:55 PM, Tue - 13 February 24
  • daily-hunt
Bramhayugam
Bramhayugam

Mammootty: ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మలయాళ చిత్రం ‘భ్రమయుగం’. మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్నవిషయం తెలిసిందే. హారర్-థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడం కోసం ప్రత్యేకంగా ఏర్పడిన నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌.. వైనాట్ స్టూడియోస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకోవడంతో ‘భ్రమయుగం’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ కట్టిపడేసింది.

ఫిబ్రవరి 10న అబు దాబిలో జరిగిన వేడుకలో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. చాలా కాలం తర్వాత బ్లాక్ అండ్ వైట్ లో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ కొత్త అనుభూతిని ఇస్తోంది. పాచికల ఆట నేపథ్యంలో, తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ సాగిన ట్రైలర్.. సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. థియేటర్లలో సీటు అంచున కూర్చొని ఈ సినిమా చూడటం ఖాయమనేది ట్రైలర్ తో అర్థమైంది. అలాగే ట్రైలర్ సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా ఉంది.

‘భ్రమయుగం’ కథ కేరళలో మాయ/తంత్రంతో నిండిన యుగంలో నడుస్తుంది. ఒక గాయకుడి జీవితంలో జరిగిన అనూహ్య ఘటనల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా 2024, ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మొదట మేకర్స్ భావించారు. అయితే మాతృక భాషలో చూస్తే ఆ అనుభూతి బాగుంటుండటంతో పాటు, మరింత థ్రిల్ చేస్తుందన్న ఉద్దేశంతో ముందుగా మలయాళం భాషలో మాత్రమే విడుదల చేయాలని తాజాగా మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • latest tollywood news
  • Mammootty
  • new release date

Related News

    Latest News

    • Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!

    • Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

    • Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!

    • Amaravati Construction : 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి తేల్చేసిన చంద్రబాబు

    • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

    Trending News

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd