Actress Seetha: రెండుసార్లు అబార్షన్.. గర్భాశయం తొలగించారు.. నటి సీత కామెంట్స్ వైరల్!
ఒకప్పటి నటి సీత తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
- By Anshu Published Date - 09:00 AM, Sun - 2 March 25

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి సినీ నటి సీత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో మొండి మొగుడు పెంకి పెళ్ళాం, వజ్రం, రావణబ్రహ్మ వంటి ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సీత. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం భాషల్లో కూడా నటించి నటించింది. అలా అన్ని భాషల్లో కలిపి దాదాపుగా 60కు పైగా సినిమాలలో నటించింది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియల్స్ లో అమ్మ,అక్క క్యారెక్టర్లలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ముఖ్య స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం 2 సీరియల్ లో సుమిత్ర పాత్రలో నటిస్తూ ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది.
కార్తీక్ కీ మేనత్తగా జోష్ణకు తల్లిగా నటిస్తోంది. ఈ సీరియల్ లో సుమిత్ర పాత్రతో ప్రేక్షకులలో బాగా గుర్తింపు తెచ్చుకుంది. చాలామంది నటి సీత అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ కార్తీకదీపం సీరియల్ సుమిత్ర అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది సీత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా నటి సీతా మాట్లాడుతూ.. మూడేళ్ల వయసు నుంచి నటించడం మొదలు పెట్టాను. బాల్యంలో చాలా సినిమాలు చేశాను. పెద్ద అయిన తర్వాత తెలుగులో కంటే మలయాళం లో ఎక్కువ సినిమాలు చేశాను. ఇప్పుడు సీరియల్స్ లో బిజీ అవ్వడం వల్ల సినిమాలు చేయడం లేదు.
మా నాన్న చిన్నప్పుడు చనిపోయారు. ఇక అమ్మ నాతోపాటు షూటింగ్స్ కు వచ్చేది. ఒకరోజు విపరీతంగా దగ్గుతుంటే హాస్పిటల్ కు తీసుకెళ్లాను. అప్పుడు తనకు క్యాన్సర్ నాలుగు స్టేజి అని తెలిసింది. రెండు నెలల కంటే ఎక్కువ బతకదని చెప్పారు. ఆ సమయంలో మా అమ్మను బతికించమని ఎంతోమంది దేవుళ్లను వేడుకున్నాను. కానీ ఫలితం లేకుండా పోయింది. అందుకే అప్పటినుంచి దేవుడు అంటే నమ్మకం పోయింది. నాకు గతంలో పెళ్లయి విడాకులు కూడా అయిపోయాయి. వేరే మతానికి చెందిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నాను. ఆయనకీ కూడా అది రెండోదే! మొదటి వైవాహిక బంధంలో భర్తతో ఎక్కువగా కలిసుండలేదు. ఎప్పుడూ పుట్టింట్లోనే ఉండేదాన్ని.
ఏదైనా తప్పు జరిగుంటే విడాకులు అవుతాయి. కానీ నేను ఏ తప్పూ చేయలేదు. అయినా అలాంటి పరిస్థితి వచ్చింది. 2013లో విడాకులు అయ్యాయి. తర్వాత నా స్కూల్‌మేట్ పరిచయమయ్యాడు. 2018లో అతడిని పెళ్లి చేసుకున్నాను. నాకు గర్భాశయంలో కణతులు ఏర్పడ్డాయి. మొదటి భర్తతో ఉన్నప్పుడే ఈ సమస్య తెలిసింది. టాబ్లెట్స్ వేసుకుంటే కరిగిపోతుందని అన్నారు. కానీ అప్పటి గొడవల వల్ల పెద్దగా పట్టించుకోలేదు. తీరా రెండో పెళ్లయ్యాక ఆ కణతుల పరిమాణం పెరిగిపోయింది. ఆ గడ్డ వల్ల వేరే సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరించారు. అప్పటికే రెండుసార్లు అబార్షన్ అయింది. దాంతో నేను గర్భాశయాన్నే తొలగించుకోవాల్సి వచ్చింది. అందుకే మాకు పిల్లలు లేరు అని నటి సీత చెప్పుకొచ్చింది.