Mahesh Vanity Van : మహేష్ కొత్తగా కొనుగోలు చేసిన వ్యానిటీ వ్యాన్..ఖరీదు ఎంతో తెలుసా..?
Mahesh Vanity Van : ప్రముఖ లగ్జరీ వెహికల్ డిజైన్ కంపెనీ ‘డీసీ’ ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వ్యాన్ రూపకల్పనలో మహేష్ పర్సనల్ టేస్ట్ ప్రతిబింబించింది
- By Sudheer Published Date - 01:00 PM, Thu - 19 June 25

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) లైఫ్‌స్టైల్ ఎప్పుడూ ఫ్యాన్స్‌కు ప్రేరణగా నిలుస్తుంటుంది. తాజాగా ఆయన దగ్గరున్న అల్ట్రా మోడ్రన్ వ్యానిటీ వ్యాన్ (Vanity Van) సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ లగ్జరీ వెహికల్ డిజైన్ కంపెనీ ‘డీసీ’ ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వ్యాన్ రూపకల్పనలో మహేష్ పర్సనల్ టేస్ట్ ప్రతిబింబించింది. సామాన్య వ్యానిటీ వ్యాన్‌లా కాకుండా, ఇది ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ చక్రాలపై నడుస్తున్నట్టే ఉంటుంది. వ్యాన్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rashmika: రశ్మికా మందన్న ‘జీవిత అస్థిరత మధ్య స్వయంకు దయ చూపండి’ అంటూ అందరిని అర్ధం చేసుకోమని పిలుపు
మహేష్ ఈ వ్యానిటీ వ్యాన్ కోసం మొదట రూ.6 కోట్లు ఖర్చు పెట్టగా, తరువాత మరిన్ని హై-ఎండ్ కస్టమైజేషన్‌లతో అది రూ.8 కోట్లకు చేరింది. ఇందులో ప్రైవేట్ బెడ్‌రూమ్, మల్టీ పర్పస్ మీటింగ్ రూమ్, కాంపాక్ట్ కిచెన్, మోడర్న్ వాష్‌రూమ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఏరియా లాంటి ఫీచర్లు ఉన్నాయి. పెద్ద స్క్రీన్ టీవీ, ప్రీమియం సౌండ్ సిస్టమ్, విదేశీ లైటింగ్‌తో ఈ వ్యాన్ మరింత రాయల వాతావరణాన్ని కలిగిస్తుంది. దీనిలో ఉండే ప్రతి భాగం మహేష్ క్లాస్‌ను ప్రతిబింబిస్తుంది.
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ దగ్గర ఉన్న వోల్వో 9BR వ్యానిటీ వ్యాన్ గతంలో ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైనదిగా పేరు సంపాదించుకుంది. దాని విలువ సుమారు రూ.4-5 కోట్లు కాగా, మహేష్ వ్యాన్ దీన్ని మించి రూ.8 కోట్ల విలువకు నిలిచింది. ఈ వివరాలు బయటకు వచ్చిన తర్వాత టాలీవుడ్ ఫ్యాన్స్ కాక బాలీవుడ్ వర్గాల్లోనూ మహేష్ లగ్జరీ వాహనం చర్చనీయాంశమైంది. టాప్ క్లాస్ డిజైన్, అత్యాధునిక సదుపాయాలతో మహేష్ ఈ వ్యాన్‌తో తన లైఫ్‌స్టైల్‌కి మరో మైలురాయిని జోడించినట్టైంది. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.