Mahesh Babu : పొంగల్ హిట్ వేడుకలో పెద్దోడు చిన్నోడు..!
Mahesh Babu వెంకటేష్ సినిమా హిట్ కొట్టింది. ఐతే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కి సూపర్ స్టార్ మహేష్ వచ్చారు. కేవలం చిత్ర యూనిట్ మాత్రమే జరుపుకున్న ఈ ససెస్ పార్టీ లో చిన్నోడు అదే మహేష్, పెద్దోడు వెంకటేష్
- By Ramesh Published Date - 11:51 PM, Fri - 17 January 25

సంక్రాంతి పండగకు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా మంచి టఫ్ ఫైట్ లో రిలీజైన ఈ సినిమాల అంధ్య అదే రేంజ్ లో పోటాపోటీ నడిచింది. ఐతే గేం ఛేంజర్ ఆడియన్స్ ని పూర్తిగా సంతృప్తపరచలేదు. మరోపక్క బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా కూడా మాస్ ఆడియన్స్ కి నచ్చేసింది. ఐతే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఓటేశారు.
చాలాకాలం తర్వాత వెంకటేష్ సినిమా హిట్ కొట్టింది. ఐతే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కి సూపర్ స్టార్ మహేష్ వచ్చారు. కేవలం చిత్ర యూనిట్ మాత్రమే జరుపుకున్న ఈ ససెస్ పార్టీ లో చిన్నోడు అదే మహేష్, పెద్దోడు వెంకటేష్ ఇద్దరు సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.
వెంకటేష్, మహేష్ ఇద్దరు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశారు. ఆ సినిమా చేస్తున్న టైం లోనే ఈ ఇద్దరు స్టార్స్ చాలా క్లోజ్ అయ్యారు. మొన్న జనవరి 11కే ఆ సినిమా వచ్చి పుష్కర కాలం అవుతుంది. ఐతే సంక్రాంతికి వస్తున్నాం తో సూపర్ హిట్ కొట్టిన మళ్లీ పెద్దోడు చిన్నోడు కలిశారు.
అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు సినిమా చేశాడు మహేష్. దిల్ రాజు బ్యానర్ తో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ పార్టీలో సూపర్ స్టార్ మహేష్ కూడా అటెండ్ అయ్యి చిత్ర యూనిట్ ని ఉత్సాహంతో నింపారు.
Pooja Hegde : పూజా షో.. కుర్రాళ్లకి పండగే..!