Mahesh Babu: షూటింగ్ కు సిద్ధమవుతున్న మహేశ్ బాబు!
వరుస మరణాలు ఘట్టమనేని కుటుంబాన్ని నిరాశలోకి నెట్టేశాయి.
- Author : Balu J
Date : 25-11-2022 - 3:08 IST
Published By : Hashtagu Telugu Desk
వరుస మరణాలు ఘట్టమనేని కుటుంబాన్ని నిరాశలోకి నెట్టేశాయి. ఇటీవలనే సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో ఫ్యామిలీ అంతా శోకసంద్రంలోకి మునిగిపోయింది. తండ్రి దూరంకావడంతో మహేశ్ ఇప్పటికీ కోలుకోని పరిస్థితి. నలుగురితో ఉంటేనే మహేశ్ బెటర్ గా ఉంటున్నాడు. ఒకవేళ ఒంటరిగా ఉంటే మాత్రం తండ్రి ఆలోచనలతో బాధపడుతున్నాడని సన్నిహితులు చెప్తున్నారు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ మహేశ్ కు ధైర్యం చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఉండేకన్నా షూటింగ్ కు వెళ్తేనే బెటర్ అనే ఆలోచనలో మహేశ్ ఉన్నట్టు తెలుస్తోంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని చినబాబు నిర్మించే సినిమా ను ప్రారంభించాల్సి ఉంది. వాస్తవానికి ఈ సినిమా కోసం ఓ చిన్న ఫైట్ షెడ్యూలు చేసి ఆపేసారు. కథ మీద చర్చలు సాగించిన తరువాత కొత్త కథతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ సినిమా కోసం సీనియర్ హీరోయిన్ ను కీలకపాత్రకు తీసుకునే ఆలోచనలు సాగుతున్నాయి. ఇప్పటికే ఎన్నో వాయిదాలు పడుతున్న ఈ మూవీ ఇకనుండైనా సాఫీగా సాగాలని ఫ్యాన్స్ మహేశ్ అభిమానులు కోరుకుంటున్నారు.