Mahesh AMB: బిజినెస్ లోనూ సూపర్ స్టార్.. బెంగళూరులో AMB థియేటర్!
బిజినెస్ లో నూ తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్నాడు మహేశ్ బాబు.
- Author : Balu J
Date : 29-04-2023 - 3:05 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) టాలీవుడ్ స్టార్లలో ఒకరు మాత్రమే కాదు మంచి బిజినెస్ మేన్ కూడా. ఏషియన్ సినిమాస్ సహకారంతో మహేశ్ బాబు హైదరాబాద్‌లో AMB సినిమాస్‌ను ప్రారంభించాడు. మోడ్రన్ హంగులతో నిర్మించిన ఆ థియేటర్ ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేస్తోంది. బిజినెస్ లో నూ తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల ప్రజలు, అభిమానులు AMB థియేటర్ లో సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. ఆ ఉత్సాహంతో మరో థియేటర్ ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు మహేశ్ బాబు. బెంగళూరులో కూడా AMB థియేటర్ ఓపెన్ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
బెంగుళూరులోని గాంధీ నగర్ ప్రాంతంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని, త్వరలో నగరంలోని AMB థియేటర్లలో ప్రజలు సినిమాను చూడవచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. AMB సినిమాస్ కూడా వైజాగ్, తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రదేశాలలో మల్టీప్లెక్స్‌లను తెరవాలని యోచిస్తోంది. హైదరాబాద్‌లో ఏడు 3D స్క్రీన్‌లు ఖరీదైన ఆడిటోరియం DOLBY ATMOS సౌండ్ సిస్టమ్‌లతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు ప్రస్తుతం పూజా హెగ్డే నటించిన SSMB28 షూటింగ్‌లో ఉన్నారు.
Also Read:Traffic Restrictions: కొత్త సెక్రటేరియట్ ప్రారంభం.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు!