Mahesh Babu : ఆ ఒక్క మాట కోసం మహేష్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. మైండ్ బ్లాక్ చేస్తున్న న్యూస్..!
Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనతో కూడా సత్తా చాటుతుంది. లేటెస్ట్ గా గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ నెక్స్ట్ రాజమౌళితో చేస్తున్న సినిమాకు
- Author : Ramesh
Date : 23-02-2024 - 11:12 IST
Published By : Hashtagu Telugu Desk
Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనతో కూడా సత్తా చాటుతుంది. లేటెస్ట్ గా గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ నెక్స్ట్ రాజమౌళితో చేస్తున్న సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇక రీసెంట్ గా ఫోన్ పే పేమెంట్ సంస్థకు మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని తెలిసిందే. ఫోన్ పే లో పేమెంట్ చేసిన వెంటనే థాంక్ యు బాస్ అని మహేష్ వాయి వస్తుంది. ఫోన్ పే కి అఫీషియన్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ ఉంటున్నాడని తెలుస్తుంది.
ఇందుకోసం మహేష్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. మహేష్ ఫోన్ పే వాయిస్ ఓవర్ కోసం 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తుంది. సినిమాలతో పాటు మహేష్ చేస్తున్న వాణిజ్య ప్రకటనలు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. టాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా మహేష్ బాబు చేస్తున్న యాడ్స్ లో నెంబర్ 1 గా నిలుస్తున్నాడు. బాలీవుడ్ ఆడియన్స్ కి మహేష్ ఈ యాడ్స్ ద్వారానే దగ్గరవుతున్నడు.
శీతలపానీయాల దగ్గర నుంచి, సంతూర్, డెనిం ఇలా అన్ని ప్రకటనలతో మహేష్ అదరగొట్టేస్తున్నాడు. అయితే మహేష్ ఈ యాడ్స్ ద్వారా వచ్చిన మొత్తాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లల గుండె ఆపరేషన్ కోసం ఖర్చు చేస్తున్నాడు. ఒక మంచి పని కోసం మహేష్ సినిమాలతో పాటు ప్రకటనలు కూడా చేయడం ఫ్యాన్స్ స్వాగతిస్తున్నారు.
Also Read : Anjali Geethanjali 2 : గీతాంజలి 2 చంద్రముఖి లా కొడుతుందేంటి..?