Pic Talk: మహేశ్ ‘మాస్’ సాంగ్ రెడీ!
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ నుంచి మాస్ సాంగ్ రేపు విడుదల కాబోతుంది.
- By Balu J Updated On - 03:55 PM, Fri - 6 May 22

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ నుంచి మాస్ సాంగ్ రేపు విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు ఎంతో హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా మూవీ టీం విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే కళావతి, పెన్నీ సాంగ్ లు సోషల్ మీడియాను ఊపేస్తుండగా.. మా మా మహేశా అనే పాట ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తోందోనని అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నాయి.
‘మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్’ అనే పాటను మించి ఈ పాట ఉండబోతోందని భావిస్తున్నారు. ఎస్ తమన్ సంగీతం అందించగా, శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఫొటోలో మహేష్ బాబు పూల చొక్కా, ఖాకీ ప్యాంట్‌లో అందంగా కనిపిస్తున్నాడు. ఇక కీర్తి సురేష్ తెల్లటి క్రాప్ టాప్, వైబ్రెంట్ మిడి స్కర్ట్‌లో హోయలు ఒలకబోస్తోంది. ఈ పోస్టర్ తప్పకుండా పాటను చూడాలనే ఉత్సాహాన్ని పెంచుతుంది. థమన్ ఊర మాస్ మ్యూజిక్ అందించాడని, మహేష్ బాబు మునుపెన్నడూ లేని విధంగా డ్యాన్స్ చేశాడని అంటున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Related News

Mahesh Dance: మహేశ్ మాస్ డాన్స్.. వీడియో వైరల్
మహేశ్ హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్ మీట్‌ను కర్నూలు ‘యస్.టి.బి.టి’ కాలేజ్ గ్రౌండ్స్‌లో సోమవారం నిర్వహించారు.