Mahesh Babu Guntur Karam : నెట్ ఫ్లిక్స్ లో గుంటూరు కారం విధ్వంసం.. గ్లోబల్ చార్ట్ లో ప్లేస్..!
Mahesh Babu Guntur Karam మహేష్ త్రివిక్రం కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం సినిమా థియేట్రికల్ రిలీజ్ లో సూపర్ హిట్ కాగా ఇప్పుడు ఓటీటీలో కూడా సినిమా ట్రెండింగ్ లో ఉంటుంది.
- By Ramesh Published Date - 05:37 PM, Thu - 15 February 24

Mahesh Babu Guntur Karam మహేష్ త్రివిక్రం కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం సినిమా థియేట్రికల్ రిలీజ్ లో సూపర్ హిట్ కాగా ఇప్పుడు ఓటీటీలో కూడా సినిమా ట్రెండింగ్ లో ఉంటుంది. ఫిబ్రవరి 9న నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన గుంటూరు కారం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా రికార్డులు కొల్లగొడుతుంది. మహేష్ కు ఉన్న పాన్ ఇండియా ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా తెగ చూసేస్తున్నారు. అంతేకాదు ఓవర్సీస్ లో కూడా గుంటూరు కారం ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతుంది.
నెట్ ఫ్లిక్స్ లో గుంటూరు కారం గ్లోబల్ చార్ట్ లో స్థానం సంపాదించుకుంది. ప్రతిసారి నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసే ఈ గ్లోబల్ చార్ట్ లో వరల్డ్ వైడ్ గా ఏ సినిమా ట్రెండింగ్ ఉందో తెలుస్తుంది. 2 మిలియన్ వాచ్ అవర్స్ తో గుంటూరు కారం టాప్ 6 లో ఉంది. తెలుగు వెర్షన్ ని 1.1 మిలియన్ వాచ్ అవర్స్ చూశారట. అలా థియేట్రికల్ రన్ లోనే కాదు డిజిటల్ రిలీజ్ లో కూడా మహేష్ తన స్టామినా చూపిస్తున్నాడు.
అతడు, ఖలేజా సినిమాల తర్వాత త్రివిక్రం మహేష్ కలిసి చేసిన గుంటూరు కారం సినిమాలో రమణ పాత్రలో మహేష్ అదరగొట్టాడు. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ చేసిన డాన్స్ కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ ని ఎలాగైనా అలరించాలనే ఉద్దేశంతో తనకు టఫ్ అనిపించినా సరే మహేష్ డాన్స్ లతో దుమ్ము దులిపేశాడు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన గుంటూరు కారం సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాడని తెలిసిందే.