Guntur Karam OTT Release : ఓటీటీలో గుంటూరు కారం.. రమణగాడు డిజిటల్ స్ట్రీమింగ్ ఎందులో అంటే..!
Guntur Karam OTT Release సూపర్ స్టార్ మహేష్ నటించిన గుంటూరు కారం బాక్సాఫీస్ దగ్గర మరోసారి మహేష్ మాస్ పంజా ఏంటన్నది
- By Ramesh Published Date - 12:28 PM, Sat - 20 January 24

Guntur Karam OTT Release సూపర్ స్టార్ మహేష్ నటించిన గుంటూరు కారం బాక్సాఫీస్ దగ్గర మరోసారి మహేష్ మాస్ పంజా ఏంటన్నది చూపించింది. త్రివిక్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ వన్ మ్యాన్ షోతో రఫ్ఫాడించేశాడు. సినిమా మొదటి షో టాక్ బాగా లేకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించడంలో సక్సెస్ అయిన మహేష్ గుంటూరు కారం వారం రోజుల్లో 212 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా వసూళ్ల మీద కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join
అయితే నిర్మాత నాగ వంశీ మాత్రం తమ సినిమాకు వచ్చిన రికార్డ్ కలెక్షన్స్ ఇవని అంటున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి కూడా ఒక న్యూస్ బయటకు వచ్చింది. నెట్ ఫ్లిక్స్ గుంటూరు కారం (Guntur Karam) డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. అందుకోసం భారీ మొత్తాన్నే నిర్మాతలకు ఇచ్చారట. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ రావాల్సి ఉంది. సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన 4 వారాల దాకా ఓటీటీలో రిలీజ్ చేయకూడదనే రూల్ ఉంది. నెట్ ఫ్లిక్స్ (Netflix) ఆ రూల్ ని పాటిస్తుంది. సో గుంటూరు కారం రిలీజైన 28 రోజులకు ఓటీటీలోకి వచ్చేస్తుంది. నెట్ ఫ్లిక్స్ ఈమధ్య తెలుగు స్టార్ సినిమాల మీద ఫోకస్ చేసింది. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ వైడ్ గా తెలుగు స్టార్స్ సినిమాలు చేస్తున్న హడావుడి చూసి వారి సినిమాల మీద కన్నేసింది.
నెట్ ఫ్లిక్స్ కేవలం మహేష్ (Mahesh Babu) గుంటూరు కారం మాత్రమే కాదు ఎన్.టి.ఆ దేవర, పుష్ప 2 తో పాటుగా మరికొన్ని సినిమాల డిజిటల్ రైట్స్ కొనేసింది. తప్పకుండా ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ లో తెలుగు సినిమాల మోత మోగనుందని చెప్పొచ్చు. గుంటూరు కారం జనవరి 12న థియేట్రికల్ రిలీజ్ కాగా ఫిబ్రవరి 10 తర్వాత నెట్ ఫ్లిక్స్ లో ఓటీటీ రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. అయితే దీని గురించి నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వాల్సి ఉంది.
నెట్ ఫ్లిక్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా తెలుగు సినిమాలను చూస్తున్నారు. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో చాలా సినిమాలు రికార్డ్ వ్యూస్ సాధించాయి. రాబోయే సినిమాలు కూడా ఆ రికార్డుని కొనసాగిస్తాయని చెప్పొచ్చు.