Akira Nandan : పవన్ కొడుకు చేసిన ఎడిట్.. మహేష్ కొడుకుకి తలనొప్పిగా మారింది..
పవన్ కళ్యాణ్ కొడుకు చేసిన ఓ వీడియో ఎడిట్.. మహేష్ బాబు కొడుకు గౌతమ్ కి తలనొప్పిగా మారింది.
- By News Desk Published Date - 07:48 PM, Thu - 6 June 24

Akira Nandan : టాలీవుడ్ అభిమానులు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వారసుల తెరగేంట్రం కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. పవన్ అండ్ మహేష్ కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ ఇద్దరి స్టార్‌డమ్ ని ముందుకు తీసుకు వెళ్లే ఆ వారసత్వం కోసం ఇద్దరు హీరోల ఫ్యాన్స్ క్యూరియాసిటీతో వేచి ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోల వారసులు.. తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.
కాగా ఈ ఇద్దరి వారసులను కంపేర్ చేస్తూ.. ఈ ఇద్దరి హీరోల అభిమానులను సోషల్ మీడియాలో డిస్కషన్స్ చేస్తుంటారు. పవన్ తనయుడు అకిరా నందన్ ఏదైనా ఆసక్తికర పని చేస్తే.. ఆ పనిని తమ హీరో వారసుడు గౌతమ్ కూడా చేయాలని మహేష్ అభిమానులు కోరుకుంటారు. ఈక్రమంలోనే తాజాగా అకిరా చేసిన ఓ పని గౌతమ్ కి తలనొప్పిగా మారింది. అకిరా చేసిన ఓ వీడియో ఎడిట్ ని చూపిస్తూ.. మహేష్ అభిమానులు గౌతమ్ ని ట్యాగ్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పై అకిరా ఓ పవర్ ఫుల్ ఎడిట్ ని చేసాడు. ఆ ఎడిట్ ని రేణూదేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్ గా మారింది. తండ్రి పై కొడుకు అకిరా చేసిన ఎడిట్ పవన్ ఫ్యాన్స్ ని మాత్రమే కాదు, అందర్నీ ఫిదా చేస్తుంది. ఇక ఇది చూసిన మహేష్ బాబు అభిమానులు, ఈ వీడియోని గౌతమ్ తో ట్యాగ్ చేస్తూ.. నువ్వు ఇలాంటి ఓ ఎడిట్ చెయ్యి గౌతమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
దీంతో ప్రస్తుతం అకిరా అండ్ గౌతమ్ ట్రేండింగ్ లో ఉన్నారు. ఇక ఈ పోస్టులు, కామెంట్స్ గమనించిన కొందరు మీమర్స్.. కొన్ని మీమ్స్ చేస్తూ నెటిజెన్స్ నవ్విస్తున్నారు.
Edokti chey Gautham Babu🙃 pic.twitter.com/GHacFKvKlR
— Chandu DHFM 💫 (@Chandu08519909) June 6, 2024