Mahesh Babu and Rajamouli: SSMB29 అప్డేట్.. మహేశ్ ఫ్యాన్స్ కు పండుగే!
మహేశ్ (Mahesh Babu), రాజమౌళి సినిమాపై ఆసక్తి నెలకొంది.
- Author : Balu J
Date : 31-12-2022 - 5:33 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ లో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీ తర్వాత మహేశ్ (Mahesh Babu), రాజమౌళి సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? హీరోయిన్ ఎవరు? ఎలాంటి కథతో తీయబోతున్నారు? లాంటి విషయాలపై ప్రతిఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీకి సంబంధించిన కీలక విషయాల గురించి లీక్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. నిజజీవితంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా యాక్షన్ అడ్వైంచర్ తీయబోతున్నామని, కథ సిద్దమవుతోందని ఆయన ఇటీవలే పలు సార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన తాజా ఆప్డేట్ మరోసారి వైరల్ గా మారింది.
SS రాజమౌళి, మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్ లో అడవి నేపథ్యంలో సినిమా ఉండబోతోంది. అయితే ఈ మూవీ ఫ్రాంచైజీగా (స్వీక్వెల్స్ )గా డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సీక్వెల్‌లు వస్తాయా ? అని విజయేంద్ర ప్రసాద్‌ని అడిగినప్పుడు, “అఫ్ కోర్స్. సీక్వెల్స్ వస్తాయి. ” ఈ సీక్వెల్స్‌లో కథ మారుతున్నప్పటికీ, ప్రధాన పాత్రలు అలాగే ఉంటాయని ఆయన అన్నారు. మొదటి భాగానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను ఖరారు చేసే పనిలో ఉన్నామని ఆయన చెప్పారు. మహేష్ బాబు (Mahesh Babu) చాలా ఇంటెన్స్ యాక్టర్ అని అన్నారు. అతని యాక్షన్ సన్నివేశాలను చూస్తుంటే, చాలా ఇంటెన్స్‌గా ఉంటాయి.
ఏ రచయితకైనా ఇది చాలా మంచి విషయం అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. రాజమౌళి చాలా కాలంగా ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా తీయాలని అనుకుంటున్నారని, అయితే తనకు అవకాశం రాలేదని కూడా చెప్పాడు. ఇన్నాళ్లకు మహేశ్ బాబుతో నెరవేరబోతుందని అని అన్నాడు. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు రాజమౌళితో సినిమా గురించి మాట్లాడుతూ ‘‘బాహుబలి దర్శకుడితో ఒక్క సినిమా చేయడం అంటే ఒకేసారి 25 సినిమాలు తీసినట్లే’’ అని చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేశ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తుననాడు. మహేష్ బాబుతో పాటు, ఈ చిత్రంలో పూజా హెగ్డే కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. రాజమౌళితో ఒక్క సినిమా అంటే ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటి స్వీక్వెల్స్ ఉంటాయని తెలియడంతో మహేశ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Pawan Kalyan Kushi: బొమ్మ దద్దరిల్లింది.. పవన్ ‘ఖుషి’ దెబ్బకు థియేటర్స్ హౌజ్ ఫుల్!