SSMB 29 : మహేష్ 29 దసరాకైనా అప్డేట్ ఇస్తారా..?
సినిమా గురించి ఆరోజు ఏదైనా క్రేజీ అప్డేట్ వస్తుందని అనుకుంటున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉంటున్నారు.
- By Ramesh Published Date - 11:47 PM, Wed - 4 September 24
గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి (Rajamouli) డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే. SSMB 29 వ సినిమాకు సంబంధించి వెనక పనులు జరుగుతున్నా దాని గురించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ బయటకు రావట్లేదు. దీని వెనక రాజమౌళి మాస్టర్ ప్లాన్ ఉందని టాక్. ఎప్పుడో మే చివర్లో సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే రోజు సినిమా అనౌన్స్ మెంట్ అన్నారు అది జరగలేదు. ఆగష్టు 9 మహేష్ బర్త్ డే రోజు ఏదైనా అప్డేట్ ఇస్తారని అనుకుంటే అది జరగలేదు.
మధ్యలో పండగలు వస్తున్నాయ్ వెళ్తున్నాయ్ కానీ మహేష్ (Mahesh) 29వ సినిమా గురించి ఏ న్యూస్ రాలేదు. ఇక రాబోతున్న దసర మీద సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. సినిమా గురించి ఆరోజు ఏదైనా క్రేజీ అప్డేట్ వస్తుందని అనుకుంటున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉంటున్నారు. ఓ పక్క మహేష్ తన మేకోవర్ లుక్స్ తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్నాడు.
మహేష్ 29వ సినిమాలో ఇదివరకు ఎప్పుడు చూడని మహేష్ ని చూడబోతున్నామని తెలుస్తుంది. ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ నేపథ్యంతో తెరకెక్కే ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా విషయంలో రాజమౌళి ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. మరి దసరాకైనా అప్డేట్ ఇస్తే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అయ్యే ఛాన్స్ ఉంది.
Related News
Mahesh Babu : కొత్త బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసిన మహేష్ బాబు.. ఫిట్ గా ఉండమని చెప్తున్నాడు..
తాజాగా మరో రంగంలో మహేష్ పెట్టుబడులు పెట్టారు.