Lee Sun Kyun: ఆస్కార్ సినిమా `పారాసైట్` నటుడు ఆత్మహత్య
సౌత్ కొరియా నటుడు లీ సన్ క్యూన్ బుధవారం కన్నుమూశారు. ఆస్కార్ అవార్డు అందుకున్న 'పారాసైట్' చిత్రంలో లీ సన్ క్యూన్ ప్రధాన పాత్ర పోషించారు.
- By Praveen Aluthuru Published Date - 02:50 PM, Wed - 27 December 23
Lee Sun Kyun: సౌత్ కొరియా నటుడు లీ సన్ క్యూన్ బుధవారం కన్నుమూశారు. ఆస్కార్ అవార్డు అందుకున్న ‘పారాసైట్’ చిత్రంలో లీ సన్ క్యూన్ ప్రధాన పాత్ర పోషించారు. సియోల్‌లోని సియోంగ్ బుక్ జిల్లాలోని ఒక పార్కులో ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసు విచారణలో మరణించిన వ్యక్తి పారాసైట్ నటుడని తేలింది.
48 ఏళ్ల లీ సన్ క్యూన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక పార్కులో తన కారులో చనిపోయాడు. అతను డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన విచారణను ఎదుర్కొంటున్నాడు. సో తాజాగా ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించడం బాధాకరం. లీ సన్ క్యున్ 1975 మార్చి 2న జన్మించారు. స్టేజ్ యాక్టర్‌గా కెరీర్‌ని ప్రారంభించారు. 2000 సంవత్సరంలో ‘సైకో డ్రామా’ చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత మేక్ ఇట్ బిగ్, సెంట్ ఆఫ్ లవ్, మై మదర్, ది మెర్మైడ్ వంటి అనేక చిత్రాలలో నటించాడు.
Also Read: Anchor Gayatri Bhargavi : యాంకర్ గాయత్రీ భార్గవి ఇంట్లో విషాదం..