Lavanya Tripathi : అత్తారింట్లో లావణ్య త్రిపాఠి వినాయకచవితి.. స్పెషల్ ఫొటోలు వైరల్..
నేడు వినాయకచవితి కావడంతో అత్తారింట్లో వినాయకచవితి గ్రాండ్ గా చేసుకుంది లావణ్య.
- By News Desk Published Date - 04:43 PM, Sat - 7 September 24

Lavanya Tripathi : మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి ఇటీవల కాలికి గాయం అయిందని కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళింది. అప్పట్నుంచి సోషల్ మీడియాలో తక్కువ యాక్టివ్ గా ఉంటుంది. పెళ్లి తర్వాత లావణ్య సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతుంది. మెగా ఫ్యామిలీ కోడలు కావడంతో ఫ్యామిలీతో పెట్టే ఫొటోలు మరింత వైరల్ అవుతున్నాయి. కాలి గాయం నుంచి కోలుకున్న లావణ్య మళ్ళీ అత్తారింటికి వచ్చింది.
నేడు వినాయకచవితి కావడంతో అత్తారింట్లో వినాయకచవితి గ్రాండ్ గా చేసుకుంది లావణ్య. భర్త వరుణ్ తో, అత్తమ్మతో వినాయకుడి దగ్గర దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అత్తారింట్లో అందంగా డెకరేట్ చేసి వినాయకుడికి పూజ చేసిన ఫోటోలను కూడా లావణ్య షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
వరుణ్ – లావణ్య జంట క్యూట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read : Roshan Kanakala : యాంకర్ సుమ కొడుకుతో కలర్ ఫోటో డైరెక్టర్.. కొత్త సినిమా అనౌన్స్..