Kumari Aunty: భోజనం తిన్న తర్వాత సందీప్ కిషన్ కుమారి ఆంటీకి ఎంత డబ్బులు ఇచ్చారో తెలుసా?
కుమారి ఆంటీ.. మొన్నటి వరకు చాలామంది ప్రజలకు ఈ కుమారి ఆంటీ ఎవరు అన్నది తెలియదు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కసారిగా ఈమె క్రేజ్ పెరిగిపోవ
- By Nakshatra Published Date - 08:30 AM, Wed - 7 February 24
కుమారి ఆంటీ.. మొన్నటి వరకు చాలామంది ప్రజలకు ఈ కుమారి ఆంటీ ఎవరు అన్నది తెలియదు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కసారిగా ఈమె క్రేజ్ పెరిగిపోవడంతో పాటు ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఆమెకు మద్దతుగా నిలవడంతో ఆమె ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది. పలు యూట్యూబ్ ఛానల్స్ అలాగే ఇంటర్వ్యూలో కుమారి ఆంటీని ఇంటర్వ్యూ చేసి ఆమెకు కావాల్సినంత పాపులారిటీని సంపాదించి పెట్టారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే అదే ఆమె కొంప ముంచిందని చెప్పవచ్చు. మొన్నటికి మొన్న హోటల్ మూసివేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.
కానీ ఎట్టకేలకు చాలామంది ఆమెకు మద్దతుగా నిలవడంతో మళ్లీ ఫుడ్ బిజినెస్ ను స్టార్ట్ చేసింది కుమారి ఆంటీ. ఇటీవల ఆ సంఘటన జరిగిన తర్వాత నగరం చుట్టుపక్కల నుంచి జనాలు కుమారీ ఆంటీ చేతి వంట రుచి చూసేందుకు ఎగబడుతున్నారు. ఇన్‌స్టా గ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ ఎక్కడ చూసినా కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ వీడియోలే దర్శనమిస్తున్నాయి. యూట్యూబర్లతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా ఆమె ఇంటర్వ్యూల కోసం పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ఇటీవలే హీరో సందీప్ కిషన్ తన హోటల్ కి వచ్చి ఫుడ్ తిన్న తర్వాత ఎంత డబ్బులు పే చేశారు అన్న విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో కుమారి ఆంటీ మాట్లాడుతూ.. కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు ఇక్కడి నుంచి ఫుడ్ ను కర్రీస్ ను పార్సెల్ తీసుకొని వెళ్తారు. నేను గత 13 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాను. నేను హోటల్ స్టార్ట్ చేయకముందు టాలీవుడ్ సింగర్ హేమచంద్ర ఇంట్లో పనిమనిషిగా చేశాను అని చెప్పుకొచ్చింది కుమారి ఆంటీ. అయితే ఇటీవల సందీప్ కిషన్ తన లేటెస్ట్ మూవీ ఊరి పేరు భైరవ కోన మూవీ ప్రమోషన్లలో భాగంగా కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. హీరోయిన్ వర్ష బొల్లమ్మ తదితరులతో కలిసి అక్కడకు వచ్చిన సందీప్ ఇక్కడ టేస్టీ ఫుడ్‌ను ఆస్వాదించి వెళ్లారట. ఇందుకు గానూ కుమారీ ఆంటీ చేతిలో పదివేలు పెట్టాడట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్నారని పోలీసులు కుమారీ ఆంటీ స్టాల్‌ను క్లోజ్ చేయించినప్పుడు సందీప్ కిషన్ ఆమెకు మద్దతుగా ట్వీట్ చేశాడు. కుమారీ ఆంటీకి తన చేతనైన సాయం చేస్తానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు సందీప్ కిషన్.
Related News
Anasuya : గ్లామరస్ భామ వైల్డ్ రోల్ రచ్చ.. సుక్కు ప్లాన్ లు అన్ని ఇలానే ఉంటాయ్..!
Anasuya ఒక సూపర్ హిట్ సినిమాలో ఆడియన్స్ కు బాగా తెలిసిన ఒక బ్యూటీని డిఫరెంట్ రోల్ లో చూపిస్తే ఎలా ఉంటుంది. వారికి ముందున్న ఇమేజ్ ఏదైనా ఆ పాత్ర చేయడం