Kumari Aunty in BiggBoss 8 : బిగ్ బాస్ 8.. ఆమె ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్టేనా..?
Kumari Aunty in BiggBoss 8 బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ సక్సెస్ అవ్వగా సీజన్ 8 కోసం బుల్లితెర ఆడియన్స్ అండ్ బిగ్ బాస్ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- By Ramesh Published Date - 09:45 AM, Sun - 16 June 24
Kumari Aunty in BiggBoss 8 బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ సక్సెస్ అవ్వగా సీజన్ 8 కోసం బుల్లితెర ఆడియన్స్ అండ్ బిగ్ బాస్ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 ని కూడా కొత్తగా బిగ్ బాస్ ఆడియన్స్ ని మెప్పించేలా ప్లాన్ చేస్తున్నారట. ఆగష్టు లేదా సెప్టెంబర్ లో బిగ్ బాస్ సీజన్ 8 మొదలవుతుందని తెలుస్తుంది. కింగ్ నాగార్జుననే ఈ సీజన్ కూడా హోస్ట్ గా వ్యవహరిస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 బిగ్ బాస్ బజ్ కి మాత్రం శివాజిని హోస్ట్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయని టాక్.
ఇదిలాఉంటే ఈసారి బిగ్ బాస్ లో సోషల్ మీడియా సెలబ్రిటీస్ చాలా మంది ఉంటారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో కుమారి ఆంటీ ఉంటుందని తెలుస్తుంది. హైదరాబాద్ లో ఒక చిన్న హోటల్ లో భోజనం పెడుతూ ఫేమస్ అయిన కుమారి ఆంటీ తెలుగు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆమధ్య ఆమె ట్రెండింగ్ లో ఉన్న టైం లో కొన్ని ప్రోగ్రాంస్ లో కనిపించింది.
ఇక లేటెస్ట్ గా ఆమెకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చినట్టు తెలుస్తుంది. సీజన్ 8 లో కంటెస్టెంట్ గా ఉండేందుకు కుమారి ఆంటీని బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించారట. కుమారి ఆంటీ హౌస్ లోకి వస్తే మాత్రం కంటెస్టెంట్స్ కి తిండి విషయంలో ఇబ్బంది పడే అవకాశం లేదని చెప్పొచ్చు.
ఐతే పాపులారిటీ పరంగ ఓకే కానీ ఆమె హౌస్ లోకి వచ్చినా నాలుగు ఐదు వారాలు వంట చేయడం తప్ప టాస్కులు ఆడటం కష్టమని అంటున్న వారు ఉన్నారు. మరి నిజంగానే కుమారి ఆంటీ బిగ్ బాస్ హౌస్ కి వెళ్తుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.
Also Read : Nitin Srileela : ఎక్స్ ట్రా కాంబో.. ఈసారైనా..?