HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Krishna And Mahesh Babu Combined Movies Count

Krishna – Mahesh : కృష్ణ మహేశ్ బాబు కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?

సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు కలిసి 10 సినిమాల్లో నటించారు. అందులో మహేశ్ బాలనటుడిగా ఉన్నప్పుడు ఏడు సినిమాల్లో నటిస్తే, హీరో అయ్యాక మూడు సినిమాల్లో కలిసి నటించారు.

  • Author : News Desk Date : 31-05-2023 - 8:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Krishna and Mahesh Babu combined Movies count
Krishna and Mahesh Babu combined Movies count

నేడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి. కృష్ణ(Krishna) జయంతి కావడంతో మహేశ్ బాబు(Mahesh Babu) ఆయనని తలుచుకుంటూ ఉదయాన్నే ఓ స్పెషల్ ట్వీట్ చేశారు. ఇక కృష్ణ జయంతి కానుకగా మహేష్ నెక్స్ట్ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. మహేష్ – త్రివిక్రమ్(Trivikram) కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు గుంటూరు కారం(Gunturu Karam) అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. మహేశ్ కి తండ్రితో చాలా మంచి అనుబంధం ఉంది. మహేశ్ ని హీరోగా నిలబెట్టింది, సినిమాల్లోకి తీసుకువచ్చింది కృష్ణనే. మహేశ్ హీరో అవ్వకముందే బాలనటుడిగా పలు సినిమాల్లో నటించాడు. అందులో చాలా వరకు తన తండ్రి కృష్ణతో కలిసి నటించడం విశేషం.

సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు కలిసి 10 సినిమాల్లో నటించారు. అందులో మహేశ్ బాలనటుడిగా ఉన్నప్పుడు ఏడు సినిమాల్లో నటిస్తే, హీరో అయ్యాక మూడు సినిమాల్లో కలిసి నటించారు.

మహేశ్ బాబు తన తండ్రి కృష్ణతో కలిసి మొదటిసారి పోరాటం అనే సినిమాలో నటించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృష్ణ, మహేశ్ బాబు అన్నదమ్ములుగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

మహేశ్ బాబు కృష్ణతో కలిసి శంఖారావం సినిమాలో నటించగా ఇది కృష్ణ సొంత దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో వీరిద్దరూ తండ్రి కొడుకులుగా నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

రమేష్ బాబు, మహేశ్ బాబు కలిసి నటించిన సినిమా బజారు రౌడీ. ఈ సినిమాలో మహేశ్ బాబు కృష్ణ ఫ్యాన్ గా కనిపిస్తారు. ఇందులో కృష్ణ తన పాత్రలో హీరోగానే కొద్దిసేపు కనిపిస్తారు. ఈ సినిమాని కోదండరామిరెడ్డి తెరకెక్కించారు.

కృష్ణ దర్శకత్వంలో కృష్ణ, మహేశ్ బాబు, రమేష్ బాబు కలిసి నటించిన సినిమా ముగ్గురు కొడుకులు. ఈ సినిమాలో కృష్ణకు తమ్ముల్లుగా నటించారు రమేష్, మహేశ్. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

మహేశ్ బాబు తన తండ్రి కృష్ణతో కలిసి గూఢచారి 117 సినిమాలో నటించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేశ్ బాబు కృష్ణతో పాటు సమానంగా డ్యాన్సులు, ఫైట్స్ చేసి చిన్నప్పుడే మెప్పించాడు.

మహేశ్ బాబు డ్యూయల్ రోల్ లో తన తండ్రి కృష్ణతో కలిసి నటించిన సినిమా కొడుకు దిద్దిన కాపురం. ఈ సినిమా కృష్ణ దర్శకత్వంలోనే తెరకెక్కింది. ఈ సినిమాలో మహేశ్, కృష్ణ తండ్రి కొడుకులుగా నటించారు. ఈ సినిమా భారీ విజయం సాధించింది.

మహేశ్ బాలనటుడిగా చివరిసారి కృష్ణతో కలిసి నటించిన సినిమా అన్నాతమ్ముడు. ఈ సినిమా కూడా కృష్ణ దర్శకత్వంలోనే తెరకెక్కింది.

మహేశ్ బాబు హీరోగా నటించిన మొదటి సినిమా రాజకుమారుడులో కృష్ణ కొద్దిసేపు కనిపిస్తారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

మహేశ్, నమ్రత జంటగా నటించిన వంశీ సినిమాలో కూడా కృష్ణ నటించారు. బి.గోపాల్ ఈ సినిమాని తెరకెక్కించారు. చివరిసారిగా మహేశ్, కృష్ణ కలిసి టక్కరిదొంగ సినిమాలో నటించారు. ఈ సినిమాలో కృష్ణ క్లైమాక్స్ లో కనిపిస్తారు. ఇలా మహేశ్ బాబు, కృష్ణ దాదాపు 10 సార్లు కలిసి నటించి అభిమానులని, ప్రేక్షకులని మెప్పించారు. ఇక రియల్ లైఫ్ లో ఎన్నో సార్లు స్టేజిపై, బయట ఇద్దరూ కలిసి కనిపించి అభిమానులను కనువిందు చేశారు.

 

Also Read : Guntur Karam Movie: మాస్ స్ట్రైక్‌… మంట రేపుతున్న “గుంటూరు కారం”


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • krishna
  • Krishna Movies
  • mahesh babu
  • super star

Related News

Harish Shankar Mahesh

Mahesh Babu Fans : హరీష్ శంకర్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ ..ఉస్తాద్ ఓపెనింగ్స్ కు ప్రమాదమా ?

సినిమా విడుదలకు కేవలం కొన్ని రోజులే సమయం ఉండటంతో, ఇలాంటి వివాదాలు నెగిటివ్ టాక్‌కు దారితీయకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు మహేష్ బాబు అభిమానుల వంటి పెద్ద వర్గం మద్దతు చాలా ముఖ్యం

  • Mahesh Babu Varanasi

    Vaaranasi Movie: మైండ్ బ్లాక్ అయ్యేలా ‘వారణాసి’ ఓవర్సీస్ హక్కుల ధర !!

Latest News

  • Heart Attack: అలర్ట్..గుండె జబ్బులు ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు

  • బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

  • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd