Konda Surekha : కాంగ్రెస్ కొంపముంచిన ‘కొండా సురేఖ’ వ్యాఖ్యలు..
Konda Surekha : సమాజంలో ఎంతో గుర్తింపు ఉన్న ఫ్యామిలీ ఫై ఆలా ఎలా వ్యాఖ్యలు చేస్తారు..? ఏదో చిన్న చితక వ్యాఖ్యలు కాదుకదా..? ఓ ఫ్యామిలీ ని రోడ్డుకు ఈడ్చే వ్యాఖ్యలు చేసి సారీ అంటే సరిపోతుందా..?
- By Sudheer Published Date - 01:55 PM, Thu - 3 October 24

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఫై ప్రజలు ఆగ్రహం తో ఉగిపోతుండగా..ఇప్పుడు మంత్రి సురేఖ చేసిన కామెంట్స్ ఇంకాస్త ఆగ్రహం నింపాయి. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) ఫై ఆరోపణలు చేసే క్రమంలో సమంత (Samanta), అక్కినేని కుటుంబాల (Akkineni Nagarjuna)పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమవడంతోపాటు ప్రజలు, రాజకీయ పక్షాలు ఆమె తీరును ఖండిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గరికి వస్తున్న ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. కేవలం ఫ్రీ బస్సు , ఉచిత కరెంట్ తప్ప ఏ హామీలు అమలు చేయలేదు. రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయింది. మిగతా హామీలు ఏవి కూడా అమలు చేయకపోయేసరికి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెన్షన్ దారులు , రైతులైతే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలు కోతకు వచ్చే సమయం వచ్చినప్పటికీ ఇంకా పెట్టుబడి సాయం వేయలేదని , ఇక పెన్షన్ ల పెంపు కూడా చేయాలనీ ఇటు పెన్షన్ దారులు ఆగ్రహంగా ఉన్నారు.
ఇక హైదరాబాద్ వాసులైతే తిట్లదండకమే చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ తీసుకొచ్చిన హైడ్రా..ఎంతోమందిని రోడ్డున పడేసింది. హైడ్రా ఆచరణ సరిగా లేకపోవడం..అన్ని అనుమతులు ఉన్న భవనాలను సైతం కూల్చడం తో వారంతా హైకోర్టు కు వెళ్లారు. దీనిపై కోర్ట్ సైతం సీరియస్ అయ్యింది. ప్రస్తుతం హైడ్రా దూకుడు తగ్గినట్లు కనిపిస్తుంది.
ఇదిలా ఉంటె నిన్న మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున , సమంత ల ఫై చేసిన కామెంట్స్ పై చిత్రసీమ మొత్తం ఆగ్రహంతోఊగిపోతోంది. కేటీఆర్ వల్లే నాగ చైతన్య – సమంతలు విడిపోయారని..చిత్రసీమలో చాలామంది హీరోయిన్లకు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేసాడని..కేటీఆర్ వల్లే చాలామంది పెళ్లి చేసుకొని పోయారని ఇలా కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై చిరంజీవి దగ్గరి నుండి చిన్న చితక ఆర్టిస్టులు , డైరెక్టర్లు , నిర్మాతలు ఇలా ప్రతి ఒక్కరు స్పందిస్తూ మంత్రి ఫై , కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఫై నిప్పులు చెరిగారు.
చిత్రసీమ ఎఫెక్ట్ కు సురేఖ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అనుకోకుండా ఆలా అనాల్సి వచ్చిందని తన తప్పును సరిదిద్దుకుంటే ప్రయత్నం చేసింది. కానీ అభిమానులు, సినీ ప్రముఖులు మాత్రం సమాజంలో ఎంతో గుర్తింపు ఉన్న ఫ్యామిలీ ఫై ఆలా ఎలా వ్యాఖ్యలు చేస్తారు..? ఏదో చిన్న చితక వ్యాఖ్యలు కాదుకదా..? ఓ ఫ్యామిలీ ని రోడ్డుకు ఈడ్చే వ్యాఖ్యలు చేసి సారీ అంటే సరిపోతుందా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోపక్క మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు వరంగల్లో సురేఖ దిష్టిబొమ్మను దహనం చేశారు. కొండా వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పెద్దలు సైతం ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ప్రజల్లో వ్యక్తిరేక వస్తుండగా..ఈ టైములో ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అని మందలించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దిద్దుబాటు చర్యలకు దిగారు. సినిమా ఇండస్ట్రీకి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. ఈ ఎపిసోడ్‌ను ఇంతటితో ముగించాలని ఇండస్ట్రీని కోరారు. అక్కినేని కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ భేషరతుగా ఉపసంహరించుకున్నారని ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. ఈ వివాదంలో రెండు వైపులా ఉన్నది మహిళలే అని, ఈ విషయాన్ని ఇక్కడికే ముగిస్తే సమంజసంగా ఉంటుందని అన్నారు. ఇక నుంచి మంత్రులు, పార్టీ నేతలు జాగ్రత్తగా మాట్లాడుతారని అన్నారు. అలాగే సోషల్ మీడియాలో మహిళా మంత్రిపై చేసిన ట్రోల్స్ కూడా సినిమా పెద్దలు గమనించాలని సూచించారు.
Read Also : Odela 2 : ఓదెల-2 నుంచి పిక్‌తో.. దసరా విషెస్ చెప్పిన మిల్కీబ్యూటీ