Karthi Khaithi 2 : ఖైదీ 2.. మైండ్ బ్లాక్ అయ్యే స్టార్ లిస్ట్..!
Karthi Khaithi 2 విక్రం సినిమాలో ఢిల్లీ పేరు ప్రస్తావన తెచ్చి రోలెక్స్ పాత్రతో అదరగొట్టాడు. ఐతే లోకేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ తో కూలీ సినిమా చేస్తున్నాడు. ఈమధ్యనే వేట్టయ్యన్ తో హిట్
- By Ramesh Published Date - 11:08 AM, Tue - 5 November 24

Karthi Khaithi 2 లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఖైదీ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి బీజం వేసిన అతను విక్రం తో దాన్ని కొనసాగించాడు. విక్రం సినిమాలో ఢిల్లీ పేరు ప్రస్తావన తెచ్చి రోలెక్స్ పాత్రతో అదరగొట్టాడు. ఐతే లోకేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ తో కూలీ సినిమా చేస్తున్నాడు. ఈమధ్యనే వేట్టయ్యన్ తో హిట్ అందుకున్న రజిని నుంచి వస్తున్న మరో క్రేజీ మూవీగా కూలీపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఐతే కూలీ తర్వాత లోకేష్ ఖైదీ 2 ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కథ సిద్ధం చేయగా త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుందని తెలుస్తుంది. ఐతే ఖైదీ 2 లో రోలెక్స్ పాత్ర కూడా ఉంటుందని టాక్. కార్తీ లీడ్ రోల్ లో తెరకెక్కే ఖైదీ 2 సినిమాలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) హీరోలైన అందరు ఇందులో కేమియో ఇస్తారని టాక్. అంటే ఖైదీ 2 భారీ మల్టీస్టారర్ కాబోతుంది.
ఖైదీ 2 కి నెక్స్ట్ లెవెల్ క్రేజ్..
ఖైదీ 2 లో సూర్య దాదాపు కన్ఫర్మ్ అని తెలుస్తుండగా కమల్ హాసన్ (Kamal Hassan) కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటాడని తెలుస్తుంది. మరోపక్క దళపతి విజయ్ (Vijay) ఈ సినిమాలో ఉంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. విజయ్ కూడా ఉంటే Karthi ఖైదీ 2 (Khaithi 2)కి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వస్తుంది. కార్తీ ఖైదీ 2 కోసం లోకేష్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తుంది.
మరి ఖైదీ 2లో నిజంగానే ఈ స్టార్స్ అంతా ఉంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కూలీ షూటింగ్ పూర్తి కాగానే ఖైదీ 2 పనులు మొదలు పెట్టాలని చూస్తున్నారు లోకేష్. తప్పకుండా ఈ కాంబో మరింత స్పెషల్ కానుంది.
Also Read : Venu Yellamma : వేణు ఎల్లమ్మకి ఫైనల్ గా హీరో దొరికేశాడా..?