Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ..?
కిరణ్ అబ్బవరం పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందట. ఈ నెలలోనే కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ తో ఏడడుగులు వేయబోతున్నారు.
- Author : News Desk
Date : 16-08-2024 - 4:42 IST
Published By : Hashtagu Telugu Desk
Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరికొన్ని రోజులు ఏడడుగులు వేయబోతున్నారట. ఈ ఏడాది మార్చిలో హీరోయిన్ రహస్య గోరక్ తో కిరణ్ అబ్బవరం నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ‘రాజావారు రాణిగారు’ సినిమాలో జంటగా నటించారు. ఈ మూవీతోనే వీరిద్దరూ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరు మధ్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. ఇప్పుడు అది పెళ్లి వరకు చేరుకుంది.
మార్చి 13న హైదరాబాద్ లో చాలా సింపుల్ గా ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట.. పెళ్లిని కూడా అలాగే జరుపోకున్నారట. ఈ నెలలోనే వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందట. ఆగష్టు 22న కిరణ్, రహస్య పెళ్లి జరగబోతుంది. ఇక ఈ వివాహానికి కర్ణాటకలోని టూరిస్ట్ టౌన్ కూర్గ్ వేదిక కాబోతుంది. కాగా ఈ పెళ్ళికి ఇరు కుటుంబసభ్యులు, అత్యంత బంధుమిత్రులు మాత్రమే హాజరుకాబోతున్నారట. ఇక ఏడడుగులు వేయబోతున్న ఈ జంటకి టాలీవుడ్ ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా రహస్య గోరక్ ‘రాజావారు రాణిగారు’ సినిమా తరువాత రెండు మూడు సినిమాల్లో మాత్రమే నటించారు. ప్రస్తుతం కూడా ఏ సినిమాల్లో నటించడం లేదు. మరి భవిషత్తులో కిరణ్ అబ్బవరం సినిమాల్లో ఏమైనా గెస్ట్ అపిరెన్స్ లు వంటివి ఏమైనా ఇస్తారేమో చూడాలి. ఇక కిరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘క’ అనే సినిమాలో నటిస్తున్నారు. సుజీత్ అండ్ సందీప్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్ లో మూవీ పై క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.