Khaleja Scene Repeate : ఓం నమశివ జై జై జై.. గుంటూరు కారం ఈవెంట్ లో ఖలేజా సీన్ రిపీట్..!
Khaleja Scene Repeate సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి
- Author : Ramesh
Date : 11-01-2024 - 12:17 IST
Published By : Hashtagu Telugu Desk
Khaleja Scene Repeate సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సాంగ్స్ కూడా సినిమాపై సూపర్ బజ్ పెంచాయి. ఇక ట్రైలర్ అయితే మహేష్ ఊర మాస్ యాటిట్యూడ్ కి ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేశాయంటే నమ్మాల్సిందే. జస్ట్ ట్రైలర్ శాంపిల్ తోనే సూపర్ అనిపించిన మహేష్ సినిమా మొత్తం అదరగొట్టేస్తాడని చెప్పొచ్చు.
We’re now on WhatsApp : Click to Join
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈవెంట్ లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయితే రెండేళ్ల కాలంలో తన తల్లిదండ్రులను కోల్పోయిన మహేష్ ఇక నుంచి అమ్మా నాన్నా అన్నీ మీరే అని ఫ్యాన్స్ ని ఉద్దేశించి అన్నాడు. అలా చెప్పడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఎమోషనల్ అయ్యారు. ఇంత ప్రేమ చూపిస్తున్న మీకు ఏం చేయగలను చేతులెత్తి దండం పెట్టడం తప్పా అని మహేష్ చేతులు ఎత్తి అభిమానులకు దండం పెట్టాడు.
ఆ టైం లో ఆ గ్రౌండ్ లో ఉన్న అభిమానులు కూడా రెండు చేతులెత్తి దండం పెట్టారు. ఈ సీన్ చూస్తే మహేష్ నటించిన ఖలేజా సినిమాలో జబ్బుతో ఉన్న పాపని బ్రతికించినప్పుడు అందరు నేల మీద పడుకుని ఉంటరు. ఆ టైం లో వెనక మణిశర్మ ఓ నమశివ జై జై జై అని బిజిఎం వేస్తాడు. అంతేకాదు ఆ సినిమాలో మహేష్ ఎక్కడ కనిపించినా సరే సామీ సామీ అని చేతులెత్తి మొక్కడం నేల మీద పడి దండం పెట్టడం చేస్తుంటారు.
Also Read : Nithiin injured: నితిన్ తమ్ముడు షూటింగ్ కు బ్రేక్.. రీజన్ ఇదే..
సేం అదే సీన్ గుంటూరు కారం ఈవెంట్ లో రిపీట్ అయ్యింది. మహేష్ రెండు చేతులెత్తి దండం పెడితే అందుకు రిప్లైగా గ్రౌండ్ లో ఉన్న అభిమానులంతా కూడా చేతులెత్తి మొక్కారు. ఇది కేవలం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆయనపై చూపించే ప్రేమ అభిమానమని చెప్పొచ్చు. సూపర్ స్టార్ కృష్ణ నుంచి మహేష్ వరకు హార్ట్ కోర్ అభిమానుల్గా ఉంటూ మహేష్ కి అండగా ఉంటూ వస్తున్నారు ఫ్యాన్స్. గుంటూరు కారం ఈవెంట్ లో మహేష్ ఆయన ఫ్యాన్స్ కు ఉన్న అనుబంధం ఎంత గొప్పదో తెలిసింది. మహేష్ ఎమోషనల్ స్పీచ్ చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా నీతోనే మేమంతా ఉంటామని సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు.