KGF Chapter 3: బాక్సాఫీస్ బద్దలే.. కేజీఎఫ్-2 కు మించి ‘కేజీఎఫ్-3’
హాలీవుడ్ మూవీ 'అవెంజర్స్- ది ఎండ్ గేమ్' (మూడో భాగం) అదరగొట్టే కలెక్షన్లతో ప్రపంచాన్ని షేక్ చేసిన సంగతి తెలిసిందే.
- By Balu J Published Date - 02:45 PM, Wed - 27 April 22
హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్- ది ఎండ్ గేమ్’ (మూడో భాగం) అదరగొట్టే కలెక్షన్లతో ప్రపంచాన్ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీ పార్ట్-1, పార్ట్-2 కంటే చాలా రెట్లు ఎక్కువ వసూలు చేసింది. ఇప్పుడు KGF2 తో పోల్చితే KGF-3 కూడా అటువంటి అద్భుతమైన విజయాన్ని పునరావృతం చేస్తుందని భావిస్తున్నారు. కేజీఎఫ్-2 ముగింపు సన్నివేశాల్లో చాఫ్టర్-3 పేరు వినిపించించడం విశేషం.
కేజీఎఫ్ సిరీస్ లు వరుసగా సూపర్ హిట్స్ సాధించడంతో పార్ట్-3 ఉంటుందా.. లేదా అనేది అటు ప్రేక్షుకుల్లో, ఇటు సినీవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అయితే ఈ నేపథ్యంలో మూడో భాగానికి సంబంధించి హీరో యశ్ నుంచే ఇప్పటికే కొన్ని లీకులు వస్తున్నాయి. KGF చాప్టర్ 3 మునుపెన్నడూ లేని విధంగా యాక్షన్ సన్నివేశాలు ఉండబోతోన్నట్టు యష్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కొన్ని సన్నివేశాల గురించి తాను, ప్రశాంత్‌ని అనుకున్నామని చెప్పారు. కన్నడ పరిశ్రమను భారతదేశంలోని ఇతర పరిశ్రమలు చాలా తక్కువ చేసి మాట్లాడినప్పుడు తాను ఎంతగానో బాధపడ్డానని యష్ వెల్లడించాడు. ఇప్పుడు కేజీఎఫ్‌ని శాండల్‌వుడ్ గేమ్‌చేంజర్‌గా చూడటం ఆనందంగా ఉంది. “ఒక్క అడుగు వేయడం ద్వారా మా పరిశ్రమలో చాలా మార్పు వచ్చింది. దేశంలోని ప్రతి ప్రాంత ప్రజలు దీనిని స్వీకరించారు. కేజీఎఫ్ రికార్డులు క్రియేట్ చేస్తోందని ఎవరూ ఊహించలేదు” అని అన్నాడు యష్.
భారతీయ చలనచిత్రాలు అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం గురించి మీరు ఎలా భావిస్తున్నారని అడిగినప్పుడు.. హీరో యష్ ఇలా బదులిచ్చారు. హాలీవుడ్ లో టెక్నాలజీ వాడకం ఎక్కువ. బడ్జెట్ కూడా భారీగా ఉంటుంది. కానీ మన దగ్గర కంటెంట్ కు ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టే మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అలరిస్తున్నాయి’’ అని అన్నాడు. కేజీఎఫ్1, కేజీఎఫ్2 లా కేజీఎఫ్-3 ఇండియన్ బాక్సాఫీస్‌ను ఎలా బద్దలు కొడుతుందో వేచి చూడాల్సిందే.
Related News
Sabari: ‘శబరి’ టైటిల్ పెట్టడం వెనుక అసలు ఉద్దేశం అదే – దర్శకుడు అనిల్ కాట్జ్ ఇంటర్వ్యూ
Sabari: విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘శబరి’. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. దర్శకులు బి గోపాల్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మదన్ దగ్గర పలు చిత్రాలకు పని చేసిన అనిల్ కాట్జ్ ‘శబరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ కా�