Adah Sharma: ఆన్లైన్లో లీక్ అయిన కేరళ స్టోరీ హీరోయిన్ ఫోన్ నెంబర్..!
హీరోయిన్ ఆదాశర్మ ఫోన్ నెంబర్ను ఆన్లైన్లో లీక్ అయింది. ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ ఆదాశర్మ ఫోన్ నెంబర్లో ఆన్లైన్లో లీక్ చేశాడు.
- By Nakshatra Published Date - 07:18 PM, Wed - 24 May 23
Adah Sharma: హీరోయిన్ ఆదాశర్మ ఫోన్ నెంబర్ను ఆన్లైన్లో లీక్ అయింది. ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ ఆదాశర్మ ఫోన్ నెంబర్లో ఆన్లైన్లో లీక్ చేశాడు. దీంతో ఆదాశర్మ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫోన్ నెంబర్ చక్కర్లు కొట్టడంతో చాలామంది ఆదాశర్మ అభిమానులు అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ప్రస్తుతం ఆదాశర్మ వాడుతున్న ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో పెట్టిన యూజర్.. కొత్త నెంబర్ ను కూడా లీక్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.
జాముండ బోల్టే అనే పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ యూజర్ ఆదాశర్మ ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో లీక్ చేశాడు. దీంతో ఆదాశర్మ ఫ్యాన్స్ అతడిపై మండిపడుతున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్, ముంబై ట్విట్టర్ హ్యాండిల్స్ కు ట్యాగ్ చేస్తూ ఫిర్యాదులు చేశారు. ఆ ఇన్స్టాగ్రామ్ యూజర్ అకౌంట్ డీయాక్టివేట్ అవ్వగా.. అతడు పెట్టిన పోస్టులు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ వ్యవహారంపై ఆదాశర్మ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. బెదిరింపు కాల్స్ రావడం సాధారణంగా జరుగుతూ ఉంటాయని, సెలబ్రెటీలకు ఇది కామన్ అంటూ సినీ వర్గాలు చెబుతున్నారు.
ఇటీవల వివాదాస్పద ది కేరళ స్టోరీ సినిమాలో ఆదాశర్మ కీలక పాత్రలో నటించారు. సుదీప్తో సోన్ ఈ సినిమాను తెరకెక్కించగా.. విపుల్ అమృతల్ షా నిర్మాతగా వ్యవహరించారు. టెర్రరిజం, ఇస్లామిక్ మతం, లవ్ జిహాద్ గురించి వచ్చిన ఈ సినిమాపై వివాదం రేపింది. దీంతో శాంతిభద్రతల కారణంగా ఈ సినిమాను పలు రాష్ట్రాల్లో నిషేధించారు. బెస్ట్ బెంగాల్ లో ఈ సినిమాను పూర్తిగా నిషేధించారు. ఇక తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో ఈ సినిమాకు అనుమతి ఇవ్వలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం ఈ సినిమాను ట్యాక్స్ మినహాయింపులు ఇచ్చాయి.
Related News
Adah Sharma : 3 రోజుల్లో 150 మిలియన్ వాచ్ అవర్స్.. ఓటీటీలో ది కేరళ స్టోరీ మాస్ ర్యాంపేజ్..!
Adah Sharma లాస్ట్ ఇయర్ రిలీజైన వివాదాస్పద సినిమాల్లో ఒకటి ది కేరళ స్టోరీ. సినిమా రిలీజైన టైం లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ సినిమా మీద ఏర్పడిన వివాదాలే ఆ సినిమాకు