Vijay Devarakonda : విజయ్ దేవరకొండ కు జోడి గా కీర్తి సురేష్
Vijay Devarakonda : మొదట ఈ పాత్రకు కన్నడ నటి రుక్మిణీ వసంత పేరు వినిపించినా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఓకే చేయలేదు. దీంతో చిత్రబృందం కీర్తి సురేష్ వైపుకు మొగ్గుచూపింది
- Author : Sudheer
Date : 27-03-2025 - 10:14 IST
Published By : Hashtagu Telugu Desk
విజయ్ దేవరకొండ – రవి కిరణ్ కోలా (Vijay Devarakonda – Ravi Kiran Kola) కాంబినేషన్‌లో రాబోతున్న “రౌడీ జనార్దన్” (Rowdy Janardhan) సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ (Keerthi Suresh) ఎంపికైనట్లు సమాచారం. మొదట ఈ పాత్రకు కన్నడ నటి రుక్మిణీ వసంత పేరు వినిపించినా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఓకే చేయలేదు. దీంతో చిత్రబృందం కీర్తి సురేష్ వైపుకు మొగ్గుచూపింది. విజయ్ దేవరకొండతో కీర్తి సురేష్ స్క్రీన్‌పై జోడీగా కనిపించనుండడం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.
BRS Silver Jubilee : బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభ.. వేదిక ఫిక్స్ చేసిన కేసీఆర్
ఈ సినిమాలో కథకు తగ్గట్టుగా కీర్తి సురేష్ పాత్రను గోదావరి యాసలో మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. కీర్తి ఇప్పటి వరకు మాస్, క్లాస్ పాత్రలను అద్భుతంగా పోషించి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. గోదావరి యాసలో నటించడం కోసం ఆమె ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండతో కీర్తి సురేష్ జోడీ ఫ్రెష్ కాంబినేషన్ కాబట్టి ప్రేక్షకులు ఈ కాంబోను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవి కిరణ్ కోలా గతంలో “రాజావారు రాణిగారు” సినిమాతో తన టేకింగ్‌ను నిరూపించుకున్న దర్శకుడు కావడంతో ఈ సినిమా కూడా నేచురల్ నేరేషన్‌తో అలరించబోతుందని భావిస్తున్నారు.
RC16 Title : రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ ఇదే !
ఇక “రౌడీ జనార్దన్” టైటిల్‌ను బట్టి చూస్తే.. ఈ సినిమా పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా ఉండనుందని అర్థమవుతోంది. విజయ్ దేవరకొండ రౌడీగా కనిపించే పాత్రలు ఎప్పుడూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కీర్తి సురేష్ కథానాయికగా ఎంపిక కావడంతో కథలో ఆమె పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుండగా, విజయ్ దేవరకొండ అభిమానులు దీనిపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.