Keerthy Suresh Casting Couch: అవకాశాల కోసం ‘కమిట్ మెంట్’ ఇచ్చే టైప్ కాదు!
మహానటి ఫేం కీర్తి సురేశ్ కాస్టించ్ కౌచ్ పై సంచలన కామెంట్స్ చేశారు.
- Author : Balu J
Date : 06-12-2022 - 4:40 IST
Published By : Hashtagu Telugu Desk
కాస్టింగ్ కౌచ్ (Casting Couch).. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లోనూ తరచుగా వినిపిస్తున్న మాట. ప్రముఖ హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్ట్ అనే తేడా లేకుండా చాలామంది క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డారు. ఈ వ్యవహరం మితిమీరిపోవడంతో మీడియా ముందుకొచ్చి బహటంగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహానటి ఫేం కీర్తి సురేశ్ (Keerthy Suresh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం చూసే మహిళలకు వేధింపులు నిజమేనని, క్యాస్టింగ్ కౌచ్ ఉందని హీరోయిన్ కీర్తి సురేశ్ ఓపెన్ కామెంట్స్ చేశారు. అయితే, తనకు ఇంతవరకూ అలాంటి అనుభవం ఎదురుకాలేదని ఆమె వివరించారు.
ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే సినిమాలు మానేసి జాబ్ చేసుకుంటానని తేల్చిచెప్పారు. అంతేకానీ అవకాశాల కోసం తాను కమిట్మెంట్ ఇచ్చే టైప్ కాదని స్పష్టం చేశారు. ఇక మీటూ ఉద్యమం తెరపైకి వచ్చాక సినిమా రంగంలోని కాస్టింగ్ కౌచ్ (Casting Couch) విషయం బయటపడింది. పెద్ద పెద్ద తారలు కూడా తాము ఎదుర్కొన్న వేధింపులను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అవకాశాలు రావనే భయంతోనో, కారణమేదైతేనేం అప్పటి వరకు ఎవరికీ చెప్పని విషయాలను మీడియా ముందు బయటపెట్టారు.
అయితే, వేధింపులకు గురిచేసిన వారి వివరాలను వెల్లడించకుండా అప్పటి సందర్భాన్ని చెప్పి పరోక్షంగా తమను వేధించిన వారిని హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా కాస్టింగ్ కౌచ్ (Casting Couch)పై కీర్తి సురేశ్ కూడా స్పందించారు. తనతో పాటు నటించిన కొందరు హీరోయిన్లు, ఇతర నటులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పారని వివరించారు. మన ప్రవర్తన ఎలా ఉందనేది కూడా ఈ విషయంలో ముఖ్యమేనని వ్యాఖ్యానించారు. మనం ఎలా ఉంటున్నాం.. ఏం చేస్తున్నామనేదాన్ని బట్టి కమిట్మెంట్ అడుగుతారేమోనని అభిప్రాయపడ్డారు. అందుకే తనకు ఇంతవరకు అలాంటి సందర్భం ఎదురుకాలేదని కీర్తి సురేశ్ (Keerthy Suresh) రియాక్ట్ అయ్యారు.
Also Read: Sai Pallavi with Ranbir: రణబీర్ తో సాయి పల్లవి రొమాన్స్.. క్రేజ్ అప్డేట్ ఇదిగో