Sai Pallavi with Ranbir: రణబీర్ తో సాయి పల్లవి రొమాన్స్.. క్రేజ్ అప్డేట్ ఇదిగో
సౌత్ బ్యూటీ సాయి పల్లవి బాలీవుడ్ హీరో రణ బీర్ తో జోడీ కట్టబోతోంది.
- Author : Balu J
Date : 06-12-2022 - 2:41 IST
Published By : Hashtagu Telugu Desk
సినీ ప్రేక్షకులు నిత్యం కొత్త ఫెయిర్స్ (Hit Faires) చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. అందుకే దర్శక నిర్మాతలు క్రేజీ కాంబినేషన్ వైపు గురి పెడుతుంటారు. ఇటు ప్రేక్షకులు, అటు డైరెక్టర్ల ఆలోచన కారణంగా తెర మీద ఎన్నో హిట్ కాంబినేషన్స్ ఆకట్టుకున్నాయి. ఉదాహరణకు రష్మిక-విజయ్ దేవరకొండ, నాగచైతన్య-సమంత జంటలను చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో 2023 సంవత్సరం బాలీవుడ్ ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుంది. సౌత్ దివా సాయి పల్లవి (Sai Pallavi), బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ 2023లో కలిసి నటించబోతున్నట్టు బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మధు మంతెన తదుపరి ప్రాజెక్టులో ‘రామాయణం’లో మూవీలో వీరిద్దరూ కనిపించనున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 2023లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. సీత పాత్రను పోషించడానికి సాయి పల్లవిని (Sai Pallavi) ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రణబీర్ (Ranbir) రాముడి పాత్రలో కనిపించనున్నాడు.
సీత పాత్రలో దీపికా పదుకొణె, కరీనా కపూర్‌ల పేర్లు పరిశీలిస్తున్నట్లు గతంలో గతంలో వార్తలొచ్చాయి. హృతిక్ శ్రీరాముడిగా కనిపిస్తాడని ప్రచారం జరిగింది. సోషల్ మీడియా పోస్ట్‌ల ప్రకారం.. హృతిక్ రామ్‌గా కనిపించనందున కథలో ఒక ట్విస్ట్ ఉంది. ఆయన రావణ్ పాత్రలో కనిపిస్తాడు. అయితే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వార్తలన్నీ నిజమని తేలితే సాయి పల్లవి, రణబీర్ కపూర్ ((Ranbir))ల కొత్త మిరుమిట్లు గొలిపే ఆన్-స్క్రీన్ జోడి కచ్చితంగా మెస్మరైజ్ చేయగలదు. ప్రేక్షకులకు థ్రిల్స్ ను ఇవ్వొచ్చు. ఒకవేళ ఈ వార్త నిజమైతే, ఈ ప్రాజెక్ట్ తోనే సాయి పల్లవి బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినట్టు అవుతుంది.
Also Read: Nayanthara: నయనతార నాయికగా హారర్ థ్రిల్లర్ “కనెక్ట్” రిలీజ్