Keerthi Suresh Wedding Pics : కీర్తి సురేష్ పెళ్లి పిక్స్ వైరల్
Keerthi Suresh Wedding Pics : ఈరోజు కుటుంబ సభ్యులు , సన్నిహితుల సమక్షంలో గోవాలో వీరి పెళ్లి వేడుక జరిగింది. ఈ పెళ్ళికి సంబదించిన పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి
- By Sudheer Published Date - 03:02 PM, Thu - 12 December 24

మహానటి ఫేమ్ కీర్తి సురేష్ (Keerthi Suresh) ఓ ఇంటిది అయ్యింది. ఈరోజు గోవాలో ప్రేమించిన వ్యక్తి తో మూడు ముళ్ళు వేసుకొని వివాహ బంధంలో అడుగుపెట్టింది. గత 15 ఏళ్లుగా ఆంటోనీ (Anthony) అనే వ్యక్తిని ప్రేమిస్తూ వస్తున్న కీర్తి..ఈ మధ్య తన ప్రేమ విషయాన్నీ తెలిపి షాక్ ఇచ్చింది. మహానటి మూవీ తో ఎంతో పేరు , ప్రతిష్టలు సంపాదించుకున్న కీర్తి సురేష్.. నిర్మాత జి. సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె కీర్తి. 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి, వెండితెరకు తిరిగి వచ్చిన తరువాత హీరోయిన్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది.14 నవంబర్ 2013లో వచ్చిన మలయాళ సినిమా ‘గీతాంజలి’తో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది.
తెలుగు ,తమిళ్ తో పాటు మలయాళంలో సినిమాలు చేస్తూ కీర్తి పేరు తెచ్చుకుంటుంది. ముఖ్యంగా తెలుగులో డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేసిన మహానటి మూవీ అమ్మడికి ఎంతో పేరు తీసుకురావడమే కాదు ఎన్ని అవార్డ్స్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత సినీ జనాలంతా కీర్తి ప్రేవు జపం చేసారు. ఈ మూవీ తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తట్టినప్పటికీ అవన్నీ ప్లాప్స్ అయ్యేసరికి మహానటి తో వచ్చిన గుర్తింపు అంత పోయింది. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, సామీ స్క్వేర్, పందెం కోడి 2 ,అన్నాతే… ఇలా ఆరు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ అవ్వడంతో కీర్తి సురేష్ కెరీర్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో అమ్మడు లావు తగ్గి స్లిమ్ అయ్యి కంప్లీట్ కొత్త లుక్ లోకి రావడమే కాదు అందాల ఆరబోతకు కూడా సై అనేసింది. దీంతో అభిమానులంతా ఫుల్ ఖుషి అయ్యారు. కానీ ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడం తో షాక్ అవుతున్నారు. ఈరోజు కుటుంబ సభ్యులు , సన్నిహితుల సమక్షంలో గోవాలో వీరి పెళ్లి వేడుక జరిగింది. ఈ పెళ్ళికి సంబదించిన పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. కీర్తి సురేష్ ప్రస్తుతం బేబీ జాన్ మూవీతో ఆడియెన్స్ పలకరించేందుకు రెడీగా ఉంది. ఈ పెళ్లి పనుల వల్ల ఎక్కువగా ప్రమోషన్స్‌కి రావడం లేదు. కీర్తి సురేష్ ఇప్పుడు కొన్ని రోజులు తన సమయాన్ని అంతా కూడా ఫ్యామిలీకే కేటాయించేలా ఉంది.
ANTONY THATTIL ని హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న keerthi suresh ki congratulations 💯💯
Happy married life… pic.twitter.com/eJWqyQ9vtC— శివ sathvik మానవత్వం (@railwaypoorna89) December 12, 2024
Read Also : Mark Zuckerberg : ట్రంప్‌కు రూ.8వేల కోట్లు ఇచ్చుకున్న ఫేస్‌బుక్ అధినేత.. ఎందుకు ?