Katrina Arabic Kuthu Video: విజయ్ ‘అరబిక్ కుతు’కు కత్రినా డ్యాన్స్.. వీడియో వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది.
- Author : Balu J
Date : 26-09-2022 - 9:22 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. తన డ్యాన్స్‌తో అభిమానులను అలరిస్తోంది. తాజాగా కత్రినా ‘బీస్ట్’లోని ‘అరబిక్ కుతు’ పాటపై స్కూల్ పిల్లలతో కలిసి డ్యాన్స్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను కత్రినా అభిమానులు షేర్ చేస్తున్నారు.
తమిళనాడులోని మధురైలోని మౌంటెన్ వ్యూ స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కత్రినా కైఫ్ పాల్గొంది. తర్వాత పాపులర్ అయిన ‘అరబిక్ కుతు’ పాటకు పిల్లలతో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను కత్రినా అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు 96,000 వ్యూస్, 5,000 లైక్‌లు వచ్చాయి. ఆమె క్యూట్ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ఆమె అద్భుతమైన వ్యక్తి అని మరొకరు అన్నారు.
మౌంటెన్ వ్యూ స్కూల్ రిలీఫ్ ప్రాజెక్ట్ ఇండియాలో భాగంగా స్థాపించబడింది. పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు చెప్పాలనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. కత్రినా కైఫ్ తల్లి సుజానే కొన్ని రోజులు ఈ పాఠశాలలో పాఠాలు చెప్పేవారు.
ఇంతకుముందు, ఈ పాఠశాలకు నిధులను విరాళంగా ఇవ్వాలని కత్రినా కైఫ్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ నిధులతో తరగతి గదుల నిర్మాణానికి వినియోగిస్తామన్నారు. కత్రినా కైఫ్ కెరీర్ విషయానికి వస్తే.. ‘టైగర్-3’ షూటింగ్ పూర్తి చేసుకుంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈద్ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.
#katrinakaif dance in #Arabickuthu with kids 😍💞
Mountain View School pic.twitter.com/ogTPMp3rNd— myqueenkay (@myqueenkay1) September 25, 2022