Kareena: స్విమ్ సూట్ లో కరీనా.. హోలీ అందాలతో..!
హోలి పండగను.. అందరిలాగే బాలీవుడ్ సెలబ్రెటీలు ఎంజాయ్ చేశారు. తారలు నగరంలో రంగులు పూసుకుని కనిపించారు.
- By hashtagu Published Date - 05:21 PM, Fri - 18 March 22
హోలి పండగను.. అందరిలాగే బాలీవుడ్ సెలబ్రెటీలు ఎంజాయ్ చేశారు. తారలు నగరంలో రంగులు పూసుకుని కనిపించారు. కానీ కరీనాకపూర్ మాత్రం నగరానికి దూరంగా వెళ్లారు. తన గ్యాంగ్ తో కలిసి ఎంజాయ్ చేసింది. నటాషా పూనావాలతో కలిసి బీచ్ లో హోలీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.
కరీనా తన చిన్నకొడుకు జహంగీర్ అలీఖాన్ తో కలిసి బీచ్ లో పిచ్చుకగూడు కడుతున్న ఫోటోను ఆమె ఇన్ స్టాలో షేర్ చేసింది. షేర్ చేసిన కొద్ది సేపట్లోనే ఈ ఫోటో వైరల్ గా మారింది. స్విమ్ సూట్ లో ఉన్న కరీనా కపూర్.. పిచ్చుకగూడు కట్టేందుకు కొడుకుకు హెల్ప్ చేస్తున్నట్లు ఈ ఫోటోలో కనిపించింది. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాషాపూనావాలతో పాటు తన సోదరి కరీష్మాకపూర్ తో బీచ్ లో సందడి చేసిన ఫోటోలను కరీనా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. బీచ్ లో తమకు ఇష్టమైన ఫుడ్ తింటూ ప్రియమైన వారితో ఎంజాయ్ చేస్తున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చారు కరీనా.
Related News
Inflammation : శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడే 5 కూరగాయలు
ఇన్ఫ్లమేషన్ అనేది గాయం, ఇన్ఫెక్షన్ నుండి రక్షించడానికి మన శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ యొక్క సహజ ప్రతిస్పందన. కానీ దీర్ఘకాలిక మంట గుండె జబ్బులు వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.