Kannappa First Day Collections : కన్నప్ప ఫస్ట్ డే టార్గెట్ గట్టిగానే పెట్టుకున్నాడే..!!
Kannappa First Day Collections : ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ పై టాలీవుడ్ పరిశ్రమలోనూ, అభిమానుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. ఫస్ట్ డేనే ఈ చిత్రం రూ.100 కోట్ల టార్గెట్ ను సాధిస్తుందని చిత్ర బృందం ఆశిస్తోంది
- By Sudheer Published Date - 11:06 AM, Wed - 25 June 25

డేరింగ్ అండ్ డాషింగ్ స్టార్ విష్ణు మంచు నటించిన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ , అక్షయ్ కుమార్ , కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటించడం తో ఈ సినిమాకు భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మంచి స్థాయిలో రన్ అవుతున్నాయి. ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ పై టాలీవుడ్ పరిశ్రమలోనూ, అభిమానుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. ఫస్ట్ డేనే ఈ చిత్రం రూ.100 కోట్ల టార్గెట్ ను సాధిస్తుందని చిత్ర బృందం ఆశిస్తోంది.
Tejeshwar Murder Case : తేజేశ్వర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్!
సుమారు రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, డిజిటల్ & శాటిలైట్ హక్కులను ఇంకా అమ్మలేదని సమాచారం. ఓటీటీ సంస్థలు ఇచ్చిన డీల్స్ విష్ణు మంచుకు నచ్చకపోవడంతో, సినిమా విడుదల తర్వాతే వాటిని అమ్మాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు మెజారిటీ ఏరియాలలో సొంతంగా సినిమాను విడుదల చేయడంతో రిస్క్ తీసుకున్న విష్ణు ఈ సినిమాతో భారీ రాబడులు ఆశిస్తున్నారు. కమిషన్ బేస్ మీద ఎగ్జిబిటర్లకు సినిమా ఇవ్వడం ద్వారా తొలిరోజు భారీగా వసూలు చేయాలన్నది గోల్.
ఈ సినిమాలో విష్ణు మంచు టైటిల్ పాత్రలో కనిపించగా, అక్షయ్ కుమార్ పరమేశ్వరునిగా, కాజల్ అగర్వాల్ పార్వతీగా, ప్రభాస్ రుద్రుడిగా కీలక పాత్రలు పోషించారు. అలాగే మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ లాంటి సీనియర్ స్టార్‌లు కూడా నటించడంతో పాన్-ఇండియా స్థాయిలో సినిమా మీద బజ్ ఏర్పడింది. నార్త్ ఇండియాలో ప్రభాస్, అక్షయ్‌ల కారణంగా క్రేజ్ పెరిగింది. ఇక దక్షిణభారత దేశాల్లోనూ మాస్, క్లాస్ ప్రేక్షకుల మధ్య ఆసక్తి భారీగా ఉంది. మరి విష్ణు టార్గెట్ రిచ్ అవుతాడా అనేది చూడాలి.