Shobitha Suicide Case: కన్నడ నటి శోభిత ఆత్మహత్యా.. కారణాలు తెలియాల్సి ఉంది?
కన్నడ నటి శోభిత ఆత్మహత్య కేసులో గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలంలో సూసైడ్ నోటు కనుగొన్నారు. నోటులో "మీరు చావాలి అనుకుంటే యు కెన్ డూ ఇట్" అని రాసిన శోభిత మరణంపై విచారణ కొనసాగుతోంది.
- By Kode Mohan Sai Published Date - 12:44 PM, Mon - 2 December 24

Shobitha Suicide Case: కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య కేసు మిస్టరీ ఇంకా వెలుగులోకి రాలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గచ్చిబౌలి పోలీసులు కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో, భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని పోలీసులు తెలిపారు. అయితే, శోభిత డిప్రెషన్‌లో ఉండి ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఇతర కారణాల వల్ల ఈ ఘటన చోటు చేసుకుందా అనే కోణంలో కూడా పోలిసుల దర్యాప్తు కొనసాగుతోంది.
శోభిత భర్త సుధీర్ రెడ్డిది మరియు ఇంటి చుట్టుపక్కల వారి స్టేట్‌మెంట్లను పోలీసులు రికార్డు చేశారు. సుధీర్ రెడ్డి, మ్యాట్రిమోన్‌లో శోభిత ప్రొఫైల్ చూసి ఆమెకు పెళ్లి ప్రపోజల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి తర్వాత శోభిత సీరియల్ లో నటించడం మానేసింది అని సమాచారం. ఆత్మహత్యకు ముందు శోభిత చివరిగా ఎవరితో మాట్లాడింది? ఆమె చివరగా ఎవరితో సంబంధం కలిగి ఉంది? అన్న కోణంలో కూడా విచారణ జరుగుతోంది.
ఇక, శోభిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తరువాత, గచ్చిబౌలి పోలీసులు కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించనున్నారు. కుటుంబ సభ్యులు శోభితను బెంగళూరుకు తీసుకెళ్లి పార్థివదేహానికి అంత్యక్రియలు చేయనున్నారు.
ఈ కేసులో విచారణ చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలంలో సూసైడ్ నోటు కూడా కనుగొన్నారు. ఆ నోటులో శోభిత రాసిన “మీరు చావాలి అనుకుంటే యు కెన్ డూ ఇట్” అన్న వాక్యం ఉంది. ఈ సూసైడ్ నోటు ఆధారంగా, పోలీసులు శోభిత ఆత్మహత్యకు డిప్రెషన్ కారణమా, భర్తతో విభేదాలా, లేదా సినీ ఇండస్ట్రీతో సంబంధం లేకపోవడం వల్ల కలిగిన భావన కల్పించిందా? అన్న వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి విచారణ ఇంకా తెలియాల్సి ఉంది.
గచ్చిబౌలి లోని ఫ్లాట్‌లో దుర్ఘటన:
కన్నడ బుల్లితెర నటి శోభిత ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గచ్చిబౌలి శీరాంనగర్ కాలనీలోని సీ బ్లాక్‌లో ఉన్న తన ఫ్లాట్‌లో శోభిత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పోలీసులు విచారణ చేపట్టారు.
శోభిత, ‘బ్రహ్మగంతు’, ‘నినిదలే’ వంటి సీరియల్స్‌తో పాటు కొన్ని సినిమాలలో నటించి మెప్పించారు. గతేడాది ఆమె సక్లేష్ పూర్‌కు చెందిన సుధీర్‌తో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వారు శ్రీరాంనగర్ కాలనీలో నివసిస్తున్నారు. అయితే, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
పోస్ట్‌మార్టం అనంతరం శోభిత మృతదేహాన్ని బెంగళూరు కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషాదకర ఘటనపై పోలీసులు మరింత విచారణ చేపట్టి, ఆత్మహత్యకు కారణమైన అంశాలను విచారిస్తున్నారు.