Kanguva Public Talk : కంగువా పబ్లిక్ టాక్
Kanguva Public Talk : సూర్య యాక్టింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అని కొనియాడుతున్నారు. ఫైట్స్, విజువల్స్ ఇలా అన్నీ యాంగిల్స్‌లో శివ అదరగొట్టేశాడని చెబుతున్నారు
- By Sudheer Published Date - 11:28 AM, Thu - 14 November 24

యావత్ సినీ అబిమానులు , సినీ ప్రముఖులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూర్య (Surya) కంగువా (Kanguva ) మూవీ భారీ అంచనాల నడుమ పలు భాషల్లో ఈరోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో శివ (Siva) డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించగా..బాబీ డియోల్ విలన్‌గా నటించాడు. మరి ఈ మూవీ ఎలా ఉంది..? సూర్య ఖాతాలో మరో హిట్ పడిందా..? ప్రమోషన్స్ తో అదరగొట్టిన మేకర్స్..సినిమాను కూడా అదే రేంజ్ లో అదరగొట్టారా లేదా..? సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.
సినిమా చూసిన ప్రతి ఒక్కరు బ్లాక్ బస్టర్ హిట్ అంటూ చెపుతున్నారు..సూర్య యాక్టింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అని కొనియాడుతున్నారు. ఫైట్స్, విజువల్స్ ఇలా అన్నీ యాంగిల్స్‌లో శివ అదరగొట్టేశాడని చెబుతున్నారు. కంగువాలో అదిరిపోయే సర్ ప్రైజ్‌లు కూడా ఉన్నాయని అంటున్నారు. సూర్యకి ఇది కెరీర్ బెస్ట్ అవుతుందని చెపుతున్నారు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, సూర్య దుమ్ములేపేశాడని, డీఎస్పీ ఆర్ఆర్ బాగుందని, దిశా పటానీ గ్లామర్ కూడా ప్లస్ అవుతుందని అంటున్నారు. ఇంట్రోడక్షన్ సీన్, యేలో సాంగ్ విజువల్ ఫీస్ట్‌గా ఉంటుందని అంటున్నారు. ప్రిడిక్టబుల్ స్టోరీ.. హీరో, విలన్ల మధ్య వేస్ట్‌గా బిల్డప్ క్రియేట్ చేశారు.. ఇలాంటి స్క్రీన్ ప్లేని ఇది వరకు శివ చిత్రాల్లో చాలా చూశామని అంటున్నారు.
ప్లాష్ బ్యాక్ గ్లింప్స్, కట్ చేస్తే సూర్య ఇంట్రో.. మొదటి 45 నిమిషాలు సాధారణంగా సాగుతుంది. డీఎస్పీ సాంగ్స్, బీజీఎం ఒకే అనేలా సాగుతూ.. ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో మ్యూజిక్ బాగుంది. సెకండాఫ్‌లో కొంచెం అతిగా అనిపించే క్లైమాక్స్. ఆ తర్వాత కామియో రోల్ పార్ట్ 2కు లీడ్ ఇస్తుంది. ఇక దిశాపటానీని కేవలం గ్లామర్ కోసం పెట్టారు. ఓవర్‌గా అనిపించేలా ఫ్లైట్ ఎపిసోడ్. మొత్తంగా ఒక గంట సినిమా బాగుంటది అని మరికొంతమంది చెపుతున్నారు. ఓవరాల్ గా మాత్రం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. మరి పూర్తీ రివ్యూస్ పడితే కానీ సినిమా భావిత్వం తేలదు.
Read Also : Matka Talk : వరుణ్ తేజ్ ‘మట్కా ‘ పబ్లిక్ టాక్..బన్నీ ఫ్యాన్స్ రివెంజ్ తీర్చుకున్నారా..?