Family Star: విడుదలకు ముందే ఫ్యామిలీ స్టార్ నుంచి వీడియో సాంగ్ రిలీజ్.. కళ్యాణి వచ్చా వచ్చా అంటూ?
- By Sailaja Reddy Published Date - 09:10 AM, Tue - 2 April 24

పరుశురాం డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. విడుదల తేదీకి మరొక మూడు రోజులు మాత్రమే సమయము ఉంది. దాంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్ లు ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని అభిమానులతో పాటు మూవీ మేకర్స్ కూడా భావిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మరొక సాంగ్ విడుదల చేశారు. ఈ చిత్రం నుంచి పెళ్లి సాంగ్ కళ్యాణి వచ్చా వచ్చా అనే పాట విడుదల చేసారు. తాజాగా విడుదల చేసిన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. అయితే ఈ సాంగ్ లిరికల్ వీడియోని మాత్రమే రిలీజ్ చేసారు. రిలీజ్ కి ముందు ఇలా లిరికల్ వీడియోని మాత్రమే రిలీజ్ చేయడం టాలీవుడ్ లోని ట్రెండ్, అయితే బాలీవుడ్ లో మాత్రం ఫుల్ వీడియో సాంగ్ ని విడుదల చేసేస్తారు.
ఇప్పుడు ఆ ట్రెండ్ ని టాలీవుడ్ కి తీసుకు వస్తూ.. కళ్యాణి వచ్చా వచ్చా ఫుల్ వీడియో సాంగ్ ని సినిమా రిలీజ్ కి ముందే రిలీజ్ చేసేసారు. గీత గోవిందం మూవీకి మ్యూజిక్ చేసిన గోపి సుందర్ ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు. ఈ పాటకి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాయగా మంగ్లీ, కార్తీక్ పాడారు. కాగా ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉండగా తాజాగా విడుదల చేసిన ఈ పాటతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఈ పాటను చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులు అభిమానులు ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాము అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల అయ్యి విజయ్ కు ఎలాంటి సక్సెస్ ను తెచ్చి పెడుతుందో చూడాలి మరి.