Kalyani Priyadarshan Wedding : కళ్యాణి ఇలాంటి పని చేసిందేంటి..ఫ్యాన్స్ షాక్
Kalyani Priyadarshan Wedding : బుల్లితెర సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన శ్రీరామ్ తో కళ్యాణి ఏడు అడుగులు వేసినట్లు వీడియో లో ఉంది
- Author : Sudheer
Date : 22-10-2024 - 7:32 IST
Published By : Hashtagu Telugu Desk
చిత్రసీమ(Film Industry )లో ప్రస్తుతం యంగ్ హీరోలతో పాటు ఛాన్సులు రాని యంగ్ హీరోయిన్లంతా (Hero & Heroins ) పెళ్లి (Wedding)బాట పడుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు పెళ్లి చేసుకొని చిత్రసీమకు దూరంకాగా..మరికొంతమంది పెళ్లి చేసుకున్నప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అలరిస్తున్నారు. ఈ క్రమంలో హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) సైతం పెళ్లి చేసుకుంది..కాకపోతే పెళ్ళై, తండ్రి పోస్ట్ కొట్టేసిన వ్యక్తిని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది. 1992 ఏప్రిల్ 5న ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ మరియు నటి లిజ్జి దంపతులకుజన్మించిన కళ్యాణి.. సినీ కుటుంబంలో పుట్టి పెరగడం వల్ల చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకుంది. 2017లో “హలో” అనే సినిమాతో తెలుగు లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత తెలుగు లో చిత్రలహరి , రణరంగం పలు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా ఛాన్సులు రాబట్టుకోలేకపోయింది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయినప్పటికీ అక్కడ కూడా ఆ భామకు నిరాశే ఎదురైంది. ఈ తరుణంలో శ్రీరామ్ కస్తూరి మాన్ (Sriram Kasthuriman) అనే వ్యక్తిని తాజాగా పెళ్లి చేసుకున్నట్లు ఓ వీడియో వైరల్ కావడం తో అంత షాక్ లో పడ్డారు. బుల్లితెర సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన శ్రీరామ్ తో కళ్యాణి ఏడు అడుగులు వేసినట్లు వీడియో లో ఉంది. ఆల్రెడీ పెళ్ళై ఓ కూతురు ఉంది ఉంది శ్రీరామ్ కు. అలాంటి వ్యక్తి ని కళ్యాణి పెళ్లి చేసుకోవడం ఏంటి అని కామెంట్స్ చేయడం, మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో శ్రీరామ్ సోషల్ మీడియా ద్వారా దీనిపై రియాక్ట్ అయ్యాడు. ఆ పెళ్లి వీడియో ..ఓ యాడ్ కు సంబంధించిందని క్లారిటీ ఇచ్చాడు. ఈ క్లారిటీ తో కళ్యాణి ఫ్యాన్స్ హమ్మయ్య అనుకుంటున్నారు.
Read Also : The RajaSaab : ‘రాజాసాబ్’ నుండి మరో పోస్టర్..ఈసారి తలకిందులు చేశారు