Kalki2898AD : ప్రభాస్ తో గడిపిన ఫొటోస్ ను షేర్ చేసిన దిశా పటానీ
ఇటలీలో జరిగిన సాంగ్ షూట్లో ప్రభాస్, నాగ్ అశ్విన్తో సరదాగా గడిపిన సన్నివేశాలను ఫొటోల్లో తెలిపింది
- Author : Sudheer
Date : 05-04-2024 - 6:09 IST
Published By : Hashtagu Telugu Desk
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) – దిశా పటానీ (Disha Patani ), దీపికా పదుకొనె (Deepika) జంటగా మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Aswin) డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘కల్కి 2898 AD’ (Kalki2898AD). భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. తాజాగా మూవీ షూటింగ్ కు సంబంధించిన ఫొటోలను హీరోయిన్ దిశా పటానీ ట్విటర్లో షేర్ చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఇటలీలో జరిగిన సాంగ్ షూట్లో ప్రభాస్, నాగ్ అశ్విన్తో సరదాగా గడిపిన సన్నివేశాలను ఫొటోల్లో తెలిపింది.
ఇక హిందూ మైథలాజి కథతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేసాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె డైరెక్టర్ నాగ్ అశ్విన్ బాంబే ఐఐటిలో జరుగుతున్న కాలేజీ ఫెస్ట్ లో పాల్గొన్నారు. అక్కడ స్టూడెంట్స్ తో అయన ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ కల్కి సినిమా గురించి అడిగిన పలు ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చాడు. ఇక సినిమా కథ గురించి తెలుపుతూ..తెలుగు లో సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఎక్కువ రాలేదని, కొన్ని టైం ట్రావెల్ సినిమాలు వచ్చాయి. కల్కి చాలా డిఫరెంట్ సినిమా. ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథ ఇది. హాలీవుడ్ సినిమాల్లో అక్కడి సిటీలు భవిష్యత్ లో ఎలా ఉంటాయో చూశాం. కల్కి లో ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో చూస్తారు. కల్కి కోసం దాదాపు ఐదేళ్ళుగా కష్టపడుతున్నాం. ప్రతి అంశంపై లోతుగా అలోచించి, స్క్రాచ్ నుంచి అన్ని కొత్తగా డిజైన్ చేసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాం. ప్రేక్షకులకు అది తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను అని నాగ్ అశ్విన్ తెలిపారు.
Italy photo dump.. @Kalki2898AD 🌸 it was 🥶 💨 ✨🏝️ pic.twitter.com/Rhi514vaqu
— Disha Patani (@DishPatani) April 5, 2024
Read Also : AP : జగన్, అవినాష్ లను ఓడించాలని షర్మిల పిలుపు