Prabhas : ప్రభాస్ అటు తెలంగాణలోనూ, ఇటు ఏపీలోనూ ఓటు వేయలేదు.. అసలు ఎక్కడున్నాడు..?
ప్రభాస్ అటు తెలంగాణలోనూ, ఇటు ఏపీలోనూ ఓటు వేయలేదు.. అసలు రెబల్ స్టార్ ఎక్కడున్నాడు..?
- By News Desk Published Date - 06:34 PM, Mon - 13 May 24
![Prabhas : ప్రభాస్ అటు తెలంగాణలోనూ, ఇటు ఏపీలోనూ ఓటు వేయలేదు.. అసలు ఎక్కడున్నాడు..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/Kalki-2898-AD-movie-star-Prabhas-didnt-cast-his-vote-in-Elections-2024.jpg)
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్.. పబ్లిక్ ప్లాట్ఫార్మ్ లో ఏం చేసినా అది తప్పకుండా నేషనల్ వైడ్ లో వైరల్ అవుతుంది. అలాంటి ప్రభాస్ ఒక పౌరుడిగా తాను నిర్వర్తించాల్సిన ఒక పబ్లిక్ రెస్పాన్సిబిలిటీని.. ఫాలో అవ్వడం లేదంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. నేడు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్, ఏపీలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ కి ఎన్నికలు జరుగుతున్నాయి.
దీంతో ప్రతి పౌరుడు తమ ఓటు హక్కుని ఉపయోగించుకునేందుకు దేశాలు, రాష్ట్రాలు దాటి పోలింగ్ బూత్స్ వద్దకి వచ్చారు. ఈక్రమంలోనే సినిమా హీరోలు సైతం తమ ఓటు హక్కుని ఉపయోగించుకొని.. తమ అభిమానులు కూడా ఓటు వేసి తమ భాద్యతని నిర్వర్తించాలని విజ్ఞప్తులు చేసారు. చిరంజీవి, రాజశేఖర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాని.. ఇలా ప్రతి హీరో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
❤️🫡
.#Prabhas #MaheshBabu #AlluArjun #NTR #RamCharan #Chiranjeevi #Pithapuram #RvcjTelugu pic.twitter.com/dVsbPgLwA4— RVCJ Telugu (@rvcj_telugu) May 13, 2024
అయితే ప్రభాస్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రభాస్ కనిపించకపోతే.. తన ఓటు ఏపీలో ఉండి ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో కూడా ప్రభాస్ ఎక్కడా కనిపించలేదు. దీంతో ప్రభాస్ అసలు వేసారో లేదో అన్న సందేహం మొదలయింది. నడవలేని స్థితిలో ఉన్న కోటశ్రీనివాసరావు వంటి వయసు అయిన ఆర్టిస్టులు కూడా పోలింగ్ బూత్ వద్దకి వచ్చి తమ ఓటు హక్కుని ఉపయోగించుకున్నారు.
కానీ ప్రభాస్ ఇటు తెలంగాణలో, అటు ఏపీలో ఏ పోలింగ్ బూత్ దగ్గర కనిపించకపోవడంతో.. పలువురు విమర్శలు చేస్తున్నారు. కోటశ్రీనివాసరావు వీడియోని షేర్ చేస్తూ ప్రభాస్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఒక పాన్ ఇండియా హీరో పొజిషన్ లో ఉన్న ప్రభాస్.. తన ఓటు హక్కుని ఉపయోగించుకోకుండా, తన అభిమానులకు ఎలాంటి మెసేజ్ ని ఇస్తున్నారు..? ఇదేనా ఒక భాద్యత గల పౌరుడి లక్షణం..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రభాస్ అసలు ఓటు వేసారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.
#KotaSrinivasaRao at his 80s came to cast his vote
And encouraging people to use their vote at this ageMeanwhile So called star hero #Prabhas even in his 40s don’t have a time to cast his vote
Is he a responsible citizen ?
Dont be a Dustbin #Elections2024 #APElection2024 pic.twitter.com/rbJEjbKQUx— Hemanth Kiara (@ursHemanthRKO) May 13, 2024
@PrabhasRaju the most irresponsible citizen of INDIA.
So called PAN INDIA star wants collectiins and peoples money but doesnt either vote or encourage his fans to vote ..
ABSTENTION 👎👎👎👎
no doubt why he has direction less and labour fans 👎👎👎#Elections2024 #Prabhas pic.twitter.com/rU82j6irj8
— AAkash 🐉🐲🪓 (@CultAAkash) May 13, 2024
Busy aa anna #prabhas ? Telangana lo veyyale Andhra lo kuda veyyale
— Wubba Lubba Dub Dub 🦖 (@wubalubadubddub) May 13, 2024
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Raja Saab : రాజా సాబ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ పక్కానా..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/01/Raja-Saab-Story-Maruthi-Punch-to-IMDb.jpg)
Raja Saab : రాజా సాబ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ పక్కానా..?
సినిమా మ్యూజిక్ గురించి థమన్ ఈమధ్య ఒక హింట్ ఇచ్చాడు. రాజా సాబ్ సాంగ్స్ అన్ని బ్లాక్ బస్టర్ అంటూ చెప్పేశాడు. మారుతి సినిమాల్లో సాంగ్స్ ప్రత్యేకంగా