Peddi : పెద్ది కోసం కాజల్..? వర్క్ అవుట్ అయ్యేనా..?
Peddi : గతంలో జనతా గ్యారేజ్‌లో ఎన్టీఆర్‌తో చేసిన పక్కా లోకల్ సాంగ్‌తో కాజల్ మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు కెరీర్‌కి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాజల్‌కు ఈ స్పెషల్ సాంగ్ మంచి బూస్ట్
- By Sudheer Published Date - 02:41 PM, Fri - 18 April 25

రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు (Buchhibabu) దర్శకత్వంలో పెద్ది (Peddi) అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్‌తో భారీ అంచనాలు సెట్ చేసుకుంది. జాన్వి కపూర్ (Janvikapoor) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ (Kajal) స్పెషల్ సాంగ్ చేయబోతున్నారన్న వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
Shoking : కూల్ డ్రింక్ లో బల్లి కాలు..తాగేముందు కాస్త చూసుకోండి
తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కి ప్రత్యేక క్రేజ్ ఉండగా, పుష్పలో సమంత, రంగస్థలంలో పూజ హగ్దే చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు పెద్ది సినిమాలో కాజల్ అలాంటి స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఇది నిజమే అయితే కాజల్-చరణ్ కాంబో మరోసారి తెరపై మేజిక్ రిపీట్ చేయనున్నట్లు భావిస్తున్నారు. మగధీర, గోవిందుడు అందరివాడేలే సినిమాల తర్వాత ఇది కాజల్‌కు రామ్ చరణ్‌తో మూడో కలయికగా నిలవనుంది.
గతంలో జనతా గ్యారేజ్‌లో ఎన్టీఆర్‌తో చేసిన పక్కా లోకల్ సాంగ్‌తో కాజల్ మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు కెరీర్‌కి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాజల్‌కు ఈ స్పెషల్ సాంగ్ మంచి బూస్ట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో పూజా హెగ్డే చేసిన జిగేల్ రాణి పాట ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. ఇప్పుడు కాజల్ కూడా అలాంటి పాటతో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటుందా..? పెద్ది సినిమా హైప్‌ను ఇంకొంచెం పెంచుతుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది.