Kajal Aggarwal: ‘ఆచార్య’ నుంచి కాజల్ ఔట్!
ఆచార్య మూవీలో హీరోయిన్ కాజల్ ఉంటుందా? లేదా అనే సినీ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
- Author : Balu J
Date : 25-04-2022 - 2:49 IST
Published By : Hashtagu Telugu Desk
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న ఆచార్య మూవీలో హీరోయిన్ కాజల్ నటిస్తుందా.. లేదా..? అనే విషయమై సినీ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ నిర్ణయంతో ‘ఆచార్య’ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర పూర్తిగా తగ్గిపోయిందని కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు కాజల్ పాత్రపై కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు. ముగింపు లేని పాత్రలో నటిని నటింపజేయడం సరికాదని తాను భావించానని వెల్లడించాడు.
స్టోరీ ప్రకారం.. చిరుకు లవ్ ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు. ఇదే విషయాన్ని కాజల్‌తో చర్చించగా, ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి ఆమె అంగీకరించింది. మొదట్లో కాజల్ పాత్రను ఫన్నీ రోల్‌గా డిజైన్ చేశామని, కానీ రషెస్ చూసి స్టార్ నటిని ఇంత చిన్న పాత్రలో పెట్టడం సరికాదని కొరటాల శివ వివరించారు. “ఆమె నా విన్నపాన్ని అర్థం చేసుకుంది. సానుకూలంగా స్పందించి ఓకే చెప్పింది. అయితే కాజల్ ‘లాహే లాహే’ పాటలో మాత్రం కనిపిస్తుంది” అని కొరటాల శివ అన్నారు. ట్రైలర్ విడుదలైనప్పటి నుండి కాజల్ అగర్వాల్ కనిపించడం లేదని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆమె పాత్రపై కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సినిమాలో కాజల్ కనిపించడం లేదని కొరటాల శివ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆచార్య’ ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదల కానుంది. చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు.
#KajalAggarwal not part of #Chiranjeevi & #RamCharan starrer #Acharya, confirms director #KoratalaSivahttps://t.co/ExsUpFYd4S
— Pinkvilla South (@PinkvillaSouth) April 25, 2022