HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kaidhi To Have A Grand Release In Russia0966

Karthi’s Kaidhi: `ఖైదీ`కి అరుదైన ఘ‌న‌త‌!

ఒక సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకోవడం చాలా అరుదు.

  • Author : Balu J Date : 19-05-2022 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Karthi
Karthi

ఒక సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకోవడం చాలా అరుదు. 2019లో కార్తీ న‌టించిన తమిళ సినిమా `ఖైదీ`ఈ అరుదైన ఘ‌న‌త‌ను చోటు చేసుకుంది. అక్టోబర్ 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి బాక్సీఫీస్ వ‌ద్ద క్రేజ్ సంపాదించుకుంది. తొలి సినిమా నుంచి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రాలను నిర్మిస్తున్న డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్ ఖైదీ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. కార్తీ ప్రధాన పాత్రలో నరేన్, అర్జున్ దాస్, బేబీ మోనికా త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల‌లో నటించారు.

ఇండియాలో ఒక స్టార్ హీరో న‌టించిన చిత్రంలో హీరోయిన్‌, పాట‌లు వుండ‌డం స‌హ‌జం. కానీ ఖైదీ చిత్రం ఆవిష‌యాన్ని బ్రేక్ చేసింది. హీరోయిన్ లేదు. పాటలూ లేవు. ఇలాంటి విభిన్న‌మైన ఖైదీ చిత్రం హీరో కార్తీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ వంటి దక్షిణ భారత భాషలన్నింటిలోనూ ‘ఖైదీ’ ట్రెమండ‌స్ రెస్పాన్స్ సంపాదించుకుంది. తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మంచి ఆదరణ పొందింది.

ప్రస్తుతం, ఈ చిత్రం హిందీ రీమేక్, ‘భోలా’ పేరుతో నిర్మాణంలో ఉంది, ఇందులో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ‘భోలా’ చిత్రాన్ని డ్రీమ్ వారియర్, రిలయన్స్, డి-సిరీస్ మరియు అజయ్ దేవగన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పుడు రష్యాలో భారీ ఎత్తున విడుదలవుతున్న `ఖైదీ` మరో మైలురాయిని సృష్టించనుంది. ‘ఉస్నిక్’ పేరుతో దాదాపు 121 నగరాల్లో 297 థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. రష్యాలో ఇంత భారీ స్థాయిలో విడుదలవుతున్న తొలి తమిళ చిత్రం ఇదే కావడం గమనార్హం. దీని కోసం వివిధ ప్రచార కార్యక్రమాలు మరియు ఈవెంట్‌ల‌ను ప్లాన్ చేశారు. 4 సీజన్స్ క్రియేషన్స్ రష్యాలో ‘ఉస్నిక్’ని విడుదల చేస్తోంది. ఇంతకుముందు 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన తమ చిత్రం `ఖైదీ`’ రష్యాలో భారీ స్థాయిలో విడుదల కానుండటం పట్ల డ్రీమ్ వారియర్ సంతోషంగానూ గర్వంగా ఉంద‌ని పేర్కొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • karthi
  • Kollywood
  • russia
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

    • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

    • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

    • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd