NTR : ఎన్టీఆర్ స్టార్డమ్ వల్లే.. నందమూరి ఫ్యామిలీ ఆదరించిందా.. తారక్ ఏం చెప్పాడు..?
జూనియర్ ఎన్టీఆర్ స్టార్డమ్ వల్లే నందమూరి ఫ్యామిలీ ఆదరించిందా. ఈ ప్రశ్నకి ఎన్టీఆర్ ఏం చెప్పారు.
- By News Desk Published Date - 08:29 PM, Sat - 20 April 24
![NTR : ఎన్టీఆర్ స్టార్డమ్ వల్లే.. నందమూరి ఫ్యామిలీ ఆదరించిందా.. తారక్ ఏం చెప్పాడు..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/04/ntr-balayya.jpg)
NTR : జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్యకి పుట్టిన సంతానం అన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని నందమూరి కుటుంబం మొదటిలో అంగీకరించలేదని, ఎన్టీఆర్ ని నందమూరి వారసుడిగా ఒప్పుకోలేదని ఓ టాక్ ఉండేది. సినిమాల్లో ఎన్టీఆర్ కి స్టార్డమ్ వచ్చిన తరువాతే.. నందమూరి కుటుంబం దగ్గరికి తీసుకుందని చాలామంది చెప్పుకొస్తుంటారు. మరి దీని గురించి ఎన్టీఆర్ ఏం చెప్పారు..?
ఈ విషయం గురించి ఎన్టీఆర్ ని ఓ ఇంటర్వ్యూలో ప్రశించారు. “జూనియర్ ఎన్టీఆర్ కి సినిమాల్లో స్టార్డమ్ రాకుంటే నందమూరి ఫ్యామిలీ మిమ్మల్ని దగ్గర చేసుకునేదా..?” అంటూ ప్రశ్న వేశారు.
ఇక దీనికి ఎన్టీఆర్ బదులిస్తూ.. “నేను సినిమాల్లోకి రాలేదు అనుకోండి. ఎక్కడో బిజినెస్ చేసుకుంటున్నాను. అందులో బాగా సక్సెస్ అయ్యాను. అప్పుడు కూడా పలకరించేవాళ్ళు. అలా కాకుండా అసలు నేను ఏ రంగంలో సక్సెస్ అవ్వలేదు అనుకోండి. ఎప్పటికో అప్పుడు నన్ను కచ్చితంగా దగ్గర తీసుకునేవారు. తాతగారు (సీనియర్ ఎన్టీఆర్) నన్ను కేవలం పలకరించడానికి 11 ఏళ్ళు పట్టింది.
అలాగే మా బాబాయి, పిన్ని, అత్తలకు కూడా టైం పట్టేదేమో. తాతగారికి 11 ఏళ్ళు పట్టింది, వీళ్ళకి 26 ఏళ్ళు పట్టేదేమో. కానీ ఎప్పటికైనా కలిసేవాళ్ళం లేక కలవకపోయుండచ్చేమో. అయితే మన ప్రతి విషయానికి నెగటివ్ గా కాకుండా పాజిటివ్ గా తీసుకుంటే మనకి ఎలాంటి బాధ అనిపించదు. ఎవరి మీద కోపం అనిపించదు. నాకు మా బాబాయిల పై ఎవరు పైన కోపం లేదు. వాళ్ళకి నా మీద కోపం లేదు. ఇక్కడ ఎవరిది తప్పు కాదు. మన రాత అలా ఉంది అంతే. అది ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![NTR : దేవర ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతున్న అతను..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/01/NTR-Devara-Interval-Scene-Highlighted.jpg)
NTR : దేవర ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతున్న అతను..?
దేవర నుంచి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదని ఎన్.టి.ఆర్ (NTR Devara) ఫ్యాన్స్ అప్సెట్ లో ఉన్నారు. ఐతే ఈ పాటికి సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కేవలం మ్యూజిక్