Jr NTR: మనది రక్త సంబంధం కంటే గొప్ప బంధం: అభిమానులతో ఎన్టీఆర్!
వేడుకల కోసం జూనియర్ ఎన్టీఆర్ నిన్న అమెరికా వెళ్లారు.
- By Balu J Published Date - 05:17 PM, Tue - 7 March 23

వేడుకల కోసం జూనియర్ ఎన్టీఆర్ నిన్న అమెరికా వెళ్లారు. వ్యక్తిగత కారణాలతో ఆయన ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి అభిమానులు ఎన్టీఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు. అభిమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్టీఆర్ మాట్లాడారు. ‘‘మీరు చూపిస్తున్న అభిమానానికి పదాలు కనిపెట్టలేదు. అయితే మనసులో ఒక మాట ఏంటంటే.. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి వంద రెట్లు అభిమానం నా గుండెల్లో ఉంది.
అది నేను చూపించలేకపోతున్నాను. మన మధ్య ఏ రక్త సంబంధం లేదు. నేనేం చేసి మీకు దగ్గరయ్యానో నాకు తెలియటం లేదు. మీరందరూ నా సోదరుల కంటే ఎక్కువ. మనది రక్త సంబంధం కంటే గొప్పదైన బంధం. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాననే మాటను చెప్పగలను. మీ ప్రేమకు నేను రుణ పడిపోయాను. ఇంకో జన్మంటూ ఉంటే ఈ అభిమానం కోసమే పుట్టాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
RRR సినిమాలో నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మార్చి 12న లాస్ ఏంజిల్స్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే RRR టీమ్ నుంచి రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి, కార్తికేయ తదితరులు అమెరికా చేరుకున్నారు. ఇప్పుడు వాళ్లతో ఎన్టీఆర్ జాయిన్ అవుతున్నారు.

Related News

RRR Oscar Campaign: ఆస్కార్ క్యాంపెయిన్ ఖర్చుపై కార్తికేయ స్పష్టత.. విమర్శలకు చెక్..!
ఆర్ఆర్ఆర్' (RRR) విడుదలైన ఏడాది తర్వాత కూడా నిరంతరం వార్తలను సృష్టిస్తోంది. మార్చి 12న లాస్ ఏంజెల్స్‌లో జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రంలోని 'నాటు నాటు' పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును అందుకుంది.