Devara : ఉదయాన్నే ‘లాస్ ఏంజెలిస్’ కు బయలుదేరిన ఎన్టీఆర్
Devara : 'లాస్ ఏంజెలిస్' లో కూడా రిలీజ్ కు ఒక రోజు ముందు అక్కడి అభిమానులతో ఎన్టీఆర్ ముచ్చటించబోతున్నారు
- By Sudheer Published Date - 09:50 AM, Mon - 23 September 24

Jr NTR jets off to Los Angeles : ఎన్టీఆర్ (NTR)..తన భార్య ప్రణీత (Pranathi ) తో కలిసి ‘లాస్ ఏంజెలిస్’ (NTR Los Angeles) కు బయలుదేరారు. ఎన్టీఆర్ నటించిన దేవర (Devara) మూవీ భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ ఫేమ్ కొరటాల శివ డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కడం..రెండు పార్ట్స్ గా రాబోతున్న ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముందుగా మొదటి పార్ట్ ఈ నెల 27 న రాబోతుంది.
ఇప్పటికే ఈ మూవీ తాలూకా ట్రైలర్స్ , టీజర్స్ , సాంగ్స్ , ప్రమోషన్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి నింపడం తో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావతా అభిమానులు , సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఏమాత్రం తగ్గకుండా సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. దీంతో అన్ని భాషల్లో సినిమాను ప్రోమోట్ చేస్తున్నారు ఎన్టీఆర్. ‘లాస్ ఏంజెలిస్’ లో కూడా రిలీజ్ కు ఒక రోజు ముందు అక్కడి అభిమానులతో ఎన్టీఆర్ ముచ్చటించబోతున్నారు. ఈ క్రమంలో నేడు ఉదయమే తన భార్య ప్రణతి తో కలిసి ఎన్టీఆర్ ‘లాస్ ఏంజెలిస్’ కు బయలుదేరారు. దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.
ఇక నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక రద్దైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని HICC నోవాటెల్ లో భారీ ఎత్తున వేడుక చేయాలనీ ఏర్పాట్లు చేసారు కానీ చివరి నిమిషంలో అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండడం తో సెక్యూర్టీ ఇబ్బందుల నేపథ్యంలో రద్దు చేసి అభిమానులను నిరాశకు గురి చేసారు. ఈవెంట్ రద్దు కావడం తో ఎన్టీఆర్ ఓ వీడియో రిలీజ్ చేసారు. ‘ఇది చాలా బాధాకరం. నాకు చాలా బాధగా ఉంది. అవకాశం ఉన్నప్పుడు ఫ్యాన్స్ తో సమయం గడపాలని, దేవర సినిమా గురించి వివరించాలని అనుకున్నా. కానీ భద్రతా కారణాలతో ఈవెంట్ రద్దైంది. నేనూ బాధపడుతున్నా. మీకంటే నా బాధ పెద్దది. ఇలా జరిగినందుకు ఎవరినీ నిందించవద్దు. మీ ప్రేమకు రుణపడి ఉంటా’ ఈ నెల 27 థియేటర్స్ లో కలుద్దాం అంటూ తెలిపారు.
మరోపక్క ‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దవడంపై హీరోయిన్ జాన్వీ కపూర్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. తెలుగులో ఎంతో చక్కగా మాట్లాడడం విశేషం. ‘అందరికీ నమస్కారం. నామీద ఇంత ప్రేమ చూపిస్తోన్న తెలుగు ప్రేక్షకులకు, జాను పాప అని పిలుస్తోన్న ఎన్టీఆర్ అభిమానులకు ధన్యవాదాలు. నన్ను సొంత మనిషిలా ఫీలవుతున్నారు. మా అమ్మకి, నాకు మీరెంతో ముఖ్యం. మీరు గర్వపడేలా కష్టపడి పనిచేస్తా. దేవర నా ఫస్ట్ తెలుగు సినిమా’ అని వీడియోలో తెలిపారు.
. @tarak9999 Anna Off to USA❤️🔥
For Beyond Fest , Hollywood Premiere💥#DevaraOnSep27th #Devara pic.twitter.com/RI5fOJYmFQ
— LOKI ™ (@NTRFever) September 23, 2024
We regret being in this situation but are forever grateful to our beloved Man of Masses NTR’s fans. 🙏🏻🙏🏻
The biggest celebration awaits. See you in theatres on Sept 27th.#Devara #DevaraOnSep27th pic.twitter.com/oSXa2ga6Za
— Devara (@DevaraMovie) September 22, 2024
నేను ఈ మాటలు స్వయంగా మీతో చెబ్ధామనుకున్నాను.
కానీ ఈ సారికి అలా కుదరలేదు.
మిమ్మల్నందరినీ త్వరలోనే కలుస్తాననుకుంటున్న.
ప్రస్తుతానికి ఇది నా నుండి మీకు
ఈ చిన్న మెసేజ్….See you in theatres on 27th of September #Devara 🌊
#DevaraTrailer #JrNTR #JanhviKapoor pic.twitter.com/ABtEt1C6KP— Janhvi Kapoor (@janhvikapoorr) September 23, 2024
Read Also : Watching Child Porn: చైల్డ్ పోర్న్ వివాదంపై ఈ రోజు సుప్రీం తీర్పు