Jonnalagadda Chaithanya : నిహారిక స్నేహితురాలిని చైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడా..?
Jonnalagadda Chaitanya : నిహారిక ఫ్రెండ్ ను జొన్నలగడ్డ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడంటూ అంటూ సోషల్ మీడియా లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
- Author : Sudheer
Date : 07-11-2024 - 3:16 IST
Published By : Hashtagu Telugu Desk
నిహారిక కొణెదల (Niharika) మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య (Jonnalagadda Chaithanya) రెండో పెళ్లి (2nd Wedding)కి సిద్దమయ్యాడా..? అదికూడా నిహారిక స్నేహితురాలినే పెళ్లి చేసుకోబోతున్నాడా..? ప్రస్తుతం ఈ వార్తలే ఫిలిం సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి. మెగా డాటర్ గా మెగా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ..ముందుగా బుల్లితెర ఫై యాంకర్ గా కెరియర్ ప్రారంభించి..సందడి చేసింది. ఆ తర్వాత సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది.
ఇక 2020 డిసెంబర్ 9వ తేదీన ఏపీ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుందీ. ఇరు కుటుంబాల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి ఎంతో కాలం నిలవలేదు. పెళైన ఏడాదిన్నరకే వీరిద్దరూ కోర్టుల ద్వారా విడిపోయారు. ఆ తర్వాత నిహారిక సినిమాలు , వెబ్ సిరీస్ లతో బిజీ గా మారితే..చైతు మాత్రం పెద్దగా మీడియా ముందు కనిపించలేదు..కానీ సోషల్ మీడియా లో నిహారిక పెట్టె పోస్ట్ లకు కౌంటర్ లు ఇయ్యడం వంటివి చేస్తుంటాడు.
తాజాగా జొన్నలగడ్డ చైతన్య గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. అదేంటంటే నిహారిక ఫ్రెండ్ ను జొన్నలగడ్డ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడంటూ అంటూ సోషల్ మీడియా లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆమె ఎవరో..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? నిహారిక వదిలేసినా అతడ్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని..? అంత మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ వార్తలు పూర్తిగా అవాస్తమే అని కొంతమంది మెగా ఫ్యాన్స్ కొట్టి పారేస్తున్నారు. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.
Read Also : Shah Rukh Khan : షారుక్ ఖాన్‌కు హత్య బెదిరింపు.. దుండగుడు ఎవరు అంటే..?