John Abraham-PM Modi : ప్రధాని మోడీకి జాన్ అబ్రహం మెసేజ్.. దేనిపై అంటే ?
John Abraham-PM Modi : జాన్ అబ్రహం.. బాలీవుడ్ లో పరిచయం అక్కరలేని పేరు.. హార్డ్ కోర్ జంతు ప్రేమికుడైన ఆయన మరోసారి జంతు సంరక్షణపై గళం విప్పారు..
- By Pasha Published Date - 04:06 PM, Mon - 17 July 23

John Abraham-PM Modi : జాన్ అబ్రహం.. బాలీవుడ్ లో పరిచయం అక్కరలేని పేరు..
హార్డ్ కోర్ జంతు ప్రేమికుడైన ఆయన మరోసారి జంతు సంరక్షణపై గళం విప్పారు..
జంతు సంరక్షణ చట్టాన్ని సవరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు.
జంతువులు కూడా రక్షణకు అర్హులేనని జాన్ అబ్రహం కామెంట్ చేశారు.
దేశవ్యాప్తంగా జంతువులను రక్షించాల్సిన అవసరాన్ని జాన్ అబ్రహం నొక్కిచెప్పారు. ఈమేరకు సందేశంతో ఒక వీడియోను ఆయన ఇన్ స్టాగ్రామ్ లో రిలీజ్ చేశారు. “పక్షి కోర్టుకు వెళ్లదు.. గుర్రం ఓటు వేయదు.. కుక్క తన దుస్థితిని జర్నలిస్టుతో పంచుకోదు.. జంతువులకు స్వరం లేదు.. కానీ మీకు ఉంది.. ఈరోజు మీరు మాట్లాడాల్సిన టైం వచ్చింది. నేను మనదేశ పార్లమెంటు సభ్యులు అందరినీ కోరేది ఏమిటంటే.. జంతువులపై మనుషులు క్రూరత్వం ప్రదర్శించడాన్ని నిరోధించేలా జంతు సంరక్షణ చట్టాన్ని సవరించాలి. దీనికి సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టండి” అని ఆ వీడియోలో జాన్ అబ్రహం(John Abraham-PM Modi) పేర్కొన్నారు.
Also read : Delhi Road Map : ఒకే వేదికపై పురంధరేశ్వరి, పవన్.! NDA సమావేశం తరువాత..?
“గుర్రాన్ని చంపినందుకు.. కుక్కపిల్లపై యాసిడ్ వేస్తే.. పిచుకలపై రాళ్లు విసిరితే కేవలం 50 రూపాయల పెనాల్టీ మాత్రమేనా ? ఇక చాలు.. భారతదేశం తన జంతు పౌరులను కూడా రక్షించుకోవాలి” అని ఆయన పిలుపునిచ్చాడు. “మనం కరుణను ప్రోత్సహిస్తే.. క్రూరత్వాన్ని శిక్షిస్తేనే అందరికీ సురక్షితమైన, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలము. జంతువుల పట్ల క్రూరత్వం భారతీయుల నైతికతకు విరుద్ధం” అని జాన్ అబ్రహం చెప్పారు. దీనిపై అభిమానులు వెంటనే కామెంట్ చేయడం ప్రారంభించారు. “జంతువులకు మనలాగే జీవించే హక్కు ఉంది” అని ఒక అభిమాని రాశాడు. జాన్ అబ్రహం చివరిసారిగా షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనేతో కలిసి పఠాన్ మూవీలో కనిపించాడు. అతను ప్రస్తుతం భూషణ్ కుమార్‌తో కలిసి జియో-పొలిటికల్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు.
Also read : Anasuya Pics: తొడలు చూపిస్తూ, రెచ్చగొడుతూ.. అనసూయ లేటెస్ట్ ఫోటోలు అదుర్స్