Cine Awards : సినీ అవార్డ్స్ అవి చూసే ఇస్తారంటూ జయసుధ సంచలన వ్యాఖ్యలు
Cine Awards : సినీ అవార్డులు ప్రతిభ ఆధారంగా ఇవ్వాల్సిందే తప్ప, కులం, మతం, ప్రాంతాన్ని బట్టి ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు
- By Sudheer Published Date - 12:12 PM, Wed - 2 July 25

సినీ రంగంలో పలు దశాబ్దాలు గడిపిన సీనియర్ నటి జయసుధ (Jayasudha) తాజాగా నటుడు, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ(Tammareddy)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలువురు ప్రముఖుల గురించి, అవార్డుల వ్యవస్థపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. సినీ అవార్డులు ప్రతిభ ఆధారంగా ఇవ్వాల్సిందే తప్ప, కులం, మతం, ప్రాంతాన్ని బట్టి ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. అవార్డులు ఎలక్షన్స్ కాదు, అవి ఒక కళాకారుడి ప్రతిభకు గుర్తింపు ఇవ్వాలని అన్నారు. చాలా కాలంగా ఉన్న అవార్డు వివాదాలపై ఇదే సమయంలో ఆమె వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
War 2 : ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ రైట్స్ దక్కించుకున్న నాగవంశీ..?
ఈ ఇంటర్వ్యూలో జయసుధ తన వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకున్నారు. సినీ రంగంలో తనకు ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురుకాలేదని స్పష్టంగా చెప్పారు. అయితే చాలా మంది హీరోయిన్లు హీరోలతో లేదా డైరెక్టర్లతో ప్రేమలో పడతారని, తాను మాత్రం ఓ బయట వ్యక్తితో ప్రేమలో పడినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో సినీ నటీనటులపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇంట్లో కుక్కల గురించి కూడా వార్తలు రాస్తున్నారని కామెంట్ చేశారు. రామారావుతో చేసిన సినిమాల పరంగా శ్రీదేవి, జయప్రదల కంటే తానే ఎక్కువగా నటించినట్లు వీడియోలో చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు.
ఇక రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత రాజకీయ నాయకుల పట్ల గౌరవం పెరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి ఇంటర్వ్యూలో ఇంకా పలు ఆసక్తికర విషయాలు ఉండే అవకాశముంది.